Top Food Blogs
Showing posts with label rani. Show all posts
Showing posts with label rani. Show all posts

Wednesday, January 4, 2012

APPALU [ SWEET ] SANKRANTHI SPECIAl

అప్పాలు = ఇది  ఒక  స్వీట్  ఐటెం . ఇది  తమిళ్న్డ వాళ్ళు చేసుకుంటారు.చేసి చూద్దాము ఎంతో తక్కువ సమయములల్లో చేసుకోవచ్చు.

 కావలిసిన పదార్థములు = 

  1. మైదా - 1 cup
  2. బియ్యం పిండి - 1/2 cup
  3. బెల్లము - 1 cup 
  4. నీరు - 1 cup 
  5. ఒట్టి కొబ్బెర - 3 tsp
  6. జీడిపప్పులు - 5 [ముక్కలు చేసుకోవాలి ]
  7. యలకల పొడి - 2 [ పొడి చేసుకోవాలి ]
  8. నూనె - కాల్చుకోవడానికి 
  9. నెయ్యి - కాల్చుకోవడానికి 
చేసుకునే పద్ధతి = 

  • మొదట బెల్లము నీరు ఒక గిన్నలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లము కరిగినాక ఓడపోసుకొని పెట్టుకోవాలి.[ఎ మన్న గలీజు వుంటే పక్కకు వస్తుంది అని]
  • పక్కన వేరే గిన్నలో మైదా,బియ్యంపిండి,ఒట్టి కొబ్బెర,యాలకల పొడి,జీడిపప్పు ముక్కలు అన్ని వేసుకొని ఒక సరి కలిపి 

  • తరువాత మొదట తాయారు చేసుకున్న బెల్లము నీరు వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకొని [మరి నీళ్ళ గా లేక గట్టిగ లేక కలుపుకొని]


  • పొంగనాల  పెన్నము  పెట్టుకొని  కాస్త నూనె,నెయ్యి వేసుకొని ఈ తాయారు చేసుకున్న పిండి వేసుకొని మూత పెట్టుకొని  మీడియం  మంట  మీద  రండు వయిపుల కాల్చుకోవాలి.
  • అంతే  ఎంతో రుచి కరము అయిన అప్పాలు తయ్యార్ .


  •  

Wednesday, December 14, 2011

BABY AALU FRY [ WITH RICE ]


బేబీ ఆలు ఫ్ర్య్ - ఇది అందరికి ఇష్టమయిన తాలింపు ఇది అన్నము లోకి చాలా బాగుంటుంది .


కావలిసిన పదార్థములు :-

  • బేబీ  ఆలు [చిన్న వుర్లగడ్డలు] - 10
  • నూనె - 10 tsp
  • ఉప్పు - తగినంత [1/2 tsp]
  • ఒట్టి కారము - తగినంత [11/2 tsp]
  • ఎల్లిపాయలు - 4
  • ఒట్టి కొబ్బెర - 1 tsp
  • పసుపు - 1/4 tsp
తాయారు చేసుకునే పద్దతి :- 
  • మొదట వుర్లగడ్డలు కోకేర్ లోవేసుకొని ఒక గ్లాస్ నీరు పోసుకొని ఒక మూడు విసిల్లు వచ్చినాక పొయ్యి బంద్ చేసుకొని విసిలు వచ్చినాక ఆలు పొట్టు తీసుకోవాలి .
  • వుడికిన ఆలు ని ఒక పిన్నీసు తీసుకొని అక్కడ అక్కడ పోడుచాలి .{ఎందుకు అంటే నూనె లో వేసినప్పుడు అవి నూనె ఎగర కుండ చూస్తుంది కాబట్టి}
తరువాత  పెన్నము తీసుకొని   నూనె వేసుకొని కాగినాక ఉడక బెట్టుకున్న ఆలు వేసుకొని మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి .
  • మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉప్పు,కారము,కొబీర,ఎల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి కారము తయ్యార్ అవుతుంది .
  • బాగా ఎర్రగా వేగినాక  ఎక్కువ నూనె అంత తీసుకొని తిప్పుకున్న కారం ఆలు లో వేసుకొని ఒక రెండు నిముషములు వేయించుకొని దించుకోవాలి అంతే.
ఆలు ఫ్ర్య్ తయ్యార్ ........................

ఇవే  చిన్న ఆలులు .

Wednesday, December 7, 2011

LAVU VANKAYA LO ELLIPAYA KARAMU

   
బర్త వంకాయ = దీనినే బర్త వంకాయ అని అంటారు మీరు చూసే వుంటారు ,మొన్న నేను కొంటె ఒకరు అడిగినారు ఎలా చేస్తారు మీరు అని ఇలా అని చేస్తారు మీకు తెలియ కుంటే చేసుకోండి .............


పూర్వము  ఆనకాగు లు ఉండేవి,ఇప్పుడు లేవు అప్పుడు ఆనకాగులో  వంకాయలు  మగ్గ బెట్టుకొని తినే వారు మరి ఇప్పుడు కాగులు  పోయినాయి వంకాయలు పోయినాయి.
నేను  ఇలా చేసినాను బాగుంది, మీరు చేయండి మా అత్తగారికి తన చిన్నతనము గుర్తు వచ్చింది మరి మీకు ...


కావలిసిన పదార్థములు = 

  • బర్త వంకాయ : ఒకటి 
  • ఒట్టి కారము : 1/2 tsp 
  • ఉప్పు : తగినంత 
  • ఎల్లిపాయలు : 4 
  • ఒట్టి కొబ్బెర : కాస్త 
తయారు చేసుకునే పద్ధతి = 

  • మొదట వంకాయ తీసుకొని కడిగి తుడచండి.
  • తరువాత చాకు తో వంకాయ ను పొడవండి.[గాట్లు పెట్టుకోవాలి]
  • గాట్లు పెట్టుకున్నాక  పొయ్యి మీద పెట్టుకని కాడ పట్టు కొని  తిప్పి తిప్పి కాల్చుకోవాలి ఇలా ..........
  • కాలినాక  వంకాయని  పొట్టు తీసుకొని ఇలా      ..........
  • కాడను చాకుతో కోసి తీసివేయాలి .
  • తరువాత మిక్సీ లో ఉప్పు,కారము,ఎల్లిపాయలు,ఒట్టి కొబ్బెర అన్ని వేసుకొని 
మిక్సీ పట్టుకొని  ఆ  కారము ఒక గిన్నలో వేసుకొని కాడ కోసినాక  మగ్గిన  వంకాయను  ఈ కారము  వేసుకున్న గిన్నలో వేసి..........
 రెండు కలిసేలా చేతితో కానీ చెంచ తో కానీ బాగా కలుపుకొని ....................
వేడి  వేడి  అన్నములో నెయ్యి  వేసుకొని  ఈ వంకాయ కలుపుకొని తింటే  చాల బాగుంటుంది .

Tuesday, December 6, 2011

GUTTI VANKAYA KURA [ RICE,PALAV,ROTI ]

గుత్తి వంకాయ కూర = వంకాయ  చాలా మందికి నచ్చే ఒక కూర గాయ అలంటి వంకాయలతో ఎన్నో కూరలు చేసుకోవచ్చు కొన్ని కస్తంయినవి కొన్ని సులబమయినవి అల సులబమయిన వాటిల్లో ఇది ఒకటి కానీ రుచి అమోఘoగా వుంటుంది మరి చేసుకుందాము పదండి ....................ఈ కూర ఒక్కటి కూడా చేసుకొని అన్నములో తినవచ్చు పట్టే సమయము ఒక్క అర గంట .


కావలిసిన పదార్థములు =

  • వంకాయలు - 1/2 kg
  • చనక్కాయలు - 1 glass 
  • నూగులు - 1/2 glass 
  • చింతపండు - నిమ్మపండు అంత [నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి ఒక అర కప్పు]
  • ఉప్పు - తగినంత 
  • ఒట్టి కారము - 1 tsp 
  • పసుపు - 1/4 tsp
  • ఎల్లిపాయలు - 5
  • ఉల్లిగడ్డలు - 3 
తాయారు చేసుకునే పద్ధతి = 

  1. మొదట  నూగులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి [కాలి పెన్నములో నుగులు వేసుకొని కలపుతూ వుండండి చిట పాట అని అంటే వేగి నటే]
  2. చనక్కాయ లు వేయించుకొని పొట్టు తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోండి ఇలా .......................



  1. ఉల్లిగడ్డలు,ఎల్లిపాయలు అన్నికలిపి మిక్సీ లో వేసుకొని పేస్టు చేసు కోవాలి .

ఇంక ఇప్పుడు కూర చేసుకుందాము -
పొయ్యి మీద గిన్న పెట్టుకొని ఒక మూడు చంచాల నూనె వేసుకొని కగినాక ఉల్లిగడ్డ,ఎల్లిపాయ పేస్టు వేసుకొని కాస్త ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకొని 




తరువాత చింత పండు పులుసు వేసుకొని కాస్త పసుపు,ఉప్పు,కారము వేసి తాయారు చేసుకున్న నూగుల,చనక్కయాల పొడి వేసుకొని కలుపుకొని తరుగుకున్న వంకాయలు వేసుకొని ఒక గ్లాస్ నీరు వేసుకోని ................


మూత మూసుకొని పెట్టుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి [కావాలి అంటే నీరు ఇంక కాస్త వేసుకోండి]వంకాయ వుడికినాక కూర ఇలా వుంటుంది, దించుకొని ఆరగించండి .