పోల్లకాయ [SNAKE GUARD] -
దీనితో ఎన్నోరకాల వంటలు చేసుకోవచ్చు ఇప్పుడు ఆవ చేసుకుందాము .ఇది ఎంతో సులబము ,అన్నములోకి చాలా బాగుంటుంది .
కావలిసిన పదార్థములు -
- పోల్లకాయ - 1
- పచ్చిమిరపకాయలు - 3
- ఉప్పు - తగినంత
- కొత్తిమీర - కాస్త
- ఆవాలు - 1/2 tsp
- పప్పుల పొడి [పుట్నాల పొడి] - 11/2 tsp
- నూనె - 5 tsp
- తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర,కరివేపాకు]
- పెరుగు - 1/2 liter
తాయారు చేసుకునే పద్ధతి =
మొదట పొల్లకాయని కడిగి ఇలా ముక్కలు చేసుకోవాలి .
తరువాత ఒక అర చెంచ ఆవాలని పొడి చేసుకోవాలి.
తరువాత పెన్నము పెట్టుకొని ఒక రెండు చెంచాల నూనె వేసుకొని కాగినాక పోల్లకాయ ముక్కలు వేసుకొని కలుపుతూ వుండాలి,మూత పెట్టుకోవాలి,మధ్య మధ్య లో
కలుపుతూ వుండాలి మగ్గేవరకు .
తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి .
మిక్సీ లో
పచ్చిమిరపకాయలు,కాస్త ఒట్టికొబ్బెర,ఉప్పు,కొత్తిమీర అన్ని కలిపి కారము వేసుకొని తయారుగా పెట్టుకున్న కమ్మటి పెరుగు లో వేసుకోవాలి ,తరువాత వేయించుకున్న పోల్లకాయలు,ఆవాల పొడి,పప్పుల పొడి వేసుకొని కలుపుకొని .........
తరువాత ఒక పెన్నము పెట్టుకొని ఒక చెంచ నూనె వేసుకొని తిరవాత వేసుకొని కలుపుకున్న ఆవలో వేసుకోవాలి.
No comments:
Post a Comment