Top Food Blogs
Showing posts with label lahari. Show all posts
Showing posts with label lahari. Show all posts

Friday, December 23, 2011

CHIKKUKU KAYA { WITH }MENTHI LEAVES TALIMPU

చిక్కుడు కాయ మెంతి ఆకు తాలింపు = మెంతి కూర వేసుకొని చిక్కుడు కాయ  కూర  వేసుకొని చేసుకొంటే చాలా బాగుంటుంది  చాలా బాగుంటుంది మాములు గా చేసుకునే దానికంటే ఇది వేరే రకంగా వుంటుంది.
కావలిసిన వస్తువులు = 
  • చిక్కుడు కాయలు - 1/2 kg 
  • మెంతి ఆకు - 2 కట్టలు 
  • నూనె - 2 tsp
  • ఉప్పు - తగినంత 
  • ఒట్టి కారము - 1 tsp [ తగినంత ]
  • తిరవాత గింజలు - 1/2 tsp             [ఆవాలు,జీలకర్ర,మినపబేడలు]
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట చిక్కుడు కాయలు కాడల కాడ నించి పీచు తీసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా ...

  • మెంతి ఆకు వలుచుకొని కడిగి పెట్టుకోవాలి ఇలా .....

  • తరువాత  గిన్న పెట్టుకొని నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక చిక్కుడు కాయలు వేసుకొని ఒక రెండు నిముషాల తరువాత మెంతి ఆకు వేసుకొని బాగా కలిపి ,మూత పెట్టుకొని మూత మీద నీళ్ళు పోసి సన్న మంట పెట్టుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుకోవాలి .
  • చిక్కుడుకాయలు మగ్గినాక ఉప్పు,కారము ,కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక అయిదు నిముషముల తరువాత పొయ్యి మీద నుంచి కూర  దించుకోవాలి .


Tuesday, December 13, 2011

POLLAKAYA AAVA


పోల్లకాయ [SNAKE GUARD] -


దీనితో  ఎన్నోరకాల వంటలు చేసుకోవచ్చు ఇప్పుడు  ఆవ చేసుకుందాము .ఇది ఎంతో సులబము ,అన్నములోకి చాలా బాగుంటుంది .
కావలిసిన పదార్థములు - 

  • పోల్లకాయ  - 1
  • పచ్చిమిరపకాయలు - 3
  • ఉప్పు - తగినంత 
  • కొత్తిమీర - కాస్త 
  • ఆవాలు - 1/2 tsp 
  • పప్పుల పొడి [పుట్నాల పొడి] - 11/2 tsp
  • నూనె - 5 tsp
  • తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర,కరివేపాకు]  
  • పెరుగు - 1/2 liter

తాయారు చేసుకునే పద్ధతి = 
మొదట పొల్లకాయని కడిగి ఇలా ముక్కలు చేసుకోవాలి .


తరువాత ఒక అర చెంచ ఆవాలని పొడి చేసుకోవాలి. 


 తరువాత పెన్నము  పెట్టుకొని ఒక రెండు చెంచాల నూనె వేసుకొని కాగినాక పోల్లకాయ ముక్కలు వేసుకొని కలుపుతూ వుండాలి,మూత పెట్టుకోవాలి,మధ్య మధ్య లో 
కలుపుతూ వుండాలి మగ్గేవరకు .
తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి .


మిక్సీ లో
 పచ్చిమిరపకాయలు,కాస్త ఒట్టికొబ్బెర,ఉప్పు,కొత్తిమీర అన్ని కలిపి కారము వేసుకొని తయారుగా పెట్టుకున్న కమ్మటి పెరుగు లో వేసుకోవాలి ,తరువాత వేయించుకున్న పోల్లకాయలు,ఆవాల పొడి,పప్పుల పొడి వేసుకొని కలుపుకొని .........
తరువాత ఒక పెన్నము పెట్టుకొని ఒక చెంచ నూనె వేసుకొని తిరవాత వేసుకొని కలుపుకున్న ఆవలో వేసుకోవాలి.