కావలిసిన వస్తువులు =
- చిక్కుడు కాయలు - 1/2 kg
- మెంతి ఆకు - 2 కట్టలు
- నూనె - 2 tsp
- ఉప్పు - తగినంత
- ఒట్టి కారము - 1 tsp [ తగినంత ]
- తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర,మినపబేడలు]
- మొదట చిక్కుడు కాయలు కాడల కాడ నించి పీచు తీసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా ...
- మెంతి ఆకు వలుచుకొని కడిగి పెట్టుకోవాలి ఇలా .....
- తరువాత గిన్న పెట్టుకొని నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక చిక్కుడు కాయలు వేసుకొని ఒక రెండు నిముషాల తరువాత మెంతి ఆకు వేసుకొని బాగా కలిపి ,మూత పెట్టుకొని మూత మీద నీళ్ళు పోసి సన్న మంట పెట్టుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుకోవాలి .
- చిక్కుడుకాయలు మగ్గినాక ఉప్పు,కారము ,కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక అయిదు నిముషముల తరువాత పొయ్యి మీద నుంచి కూర దించుకోవాలి .
No comments:
Post a Comment