రవ్వ ఇడ్లీ = ఇడ్లీ అంటే అందరికి ఇష్టము వుండదు కానీ ఇలా రక రకాలుగా చేసుకోవచ్చు మరి చేసి చూడండి.
కావలిసిన పదార్థములు =
కావలిసిన పదార్థములు =
- బొంబాయి రవ్వ - 2 glasses
- పెరుగు - 1 glass
- జీడిపప్పులు - 10
- తిరవాత గింజలు - (ఒట్టి మిరపకాయలు,శనగబేడలు,కరివేపాకు, ఆవాలు,జీలకర్ర,మినపబెడలు)- అన్ని కలిపి - 2tsp
- నూనె - 2 tsp
- ఉప్పు- తగినంత
- సోలా పొడి - చిటికెడు
- మొదట పెరుగు ఒక గిన్నలో వేసుకొని పెట్టుకోవాలి.
- ఒక గిన్నలో నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక ముక్కలు చేసుకున్న జీడిపప్పులు వేసుకొని ఒక నిముషము తరువాత బొంబాయి రవ్వ వేసుకొని సన్న మంట మీద ఒక పదినిముషములు వేయించుకున్న తరువాత పెరుగులో వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ఇడ్లీ పిండిలా కలుపుకొని తగినoత ఉప్పు,సోలాపొడి వేసుకొని కలిపి ఒక అర గంట మూత ముసి నాన బెట్టుకోవాలి.
- తరువాత ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ ప్లేట్ల కి నూనె పూసి ఇడ్లీ పిండి వేసుకొని స్టాండ్ పాత్రలో పెట్టుకొని ఒక పది నిముషముల తరువాత తీసుకొని కొబీర చెట్నీ తో తింటే బాగుంటుంది .
No comments:
Post a Comment