టిఫిన్ = ఎన్నోరకాల టిఫిన్లు చేసుకుంటాము కానీ రేపు ఏమి చేధము అని అనిపిస్తుంది మరి ఇలా ఊతప్పం చేసుకుందామా .
కావలిసిన పదార్థములు =
తాయారు చేసుకునే పద్ధతి =
- బియ్యము - 1 glass
- అటుకులు - 1/2 glass
- సగ్గుబియ్యము - 1/2 glass
- పెరుగు - 2 గ్లాస్సెస్
- ఉల్లిగడ్డలు - 2
- పచ్చిమిరపకాయలు
- కొత్తిమీర - కాస్త
- మొదట బియ్యము,అటుకులు,సగ్గుబియ్యము, పెరుగు అన్ని కలిపి ఉదయము నానబెట్టుకోవాలి .
- ఒక అయిదు ఆరు గంటల తరువాత మిక్సీ లో వేసుకొని రుబ్బుకోవాలి .
- రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి .
- మర్నాడు ఉదయం ఒక చిటికెడు సోడా పొడి వేసుకొని కలిపి .
- తరువాత ఉల్లిగడ్డలు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి,పచ్చిమిరపకాయలు,కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి .
- తరువాత పొయ్యి ముట్టించుకొని పెన్నము ముట్టించుకొని ఒక చెంచ నూనె వేసుకొని పిండి వేసుకొని ముక్కలు చేసుకున్న ఉల్లిగడ్డ,మిరపకాయ,కొత్తిమీర వేసుకొని సన్న మంట పెట్టుకొని మూత ముసుకోవాలి .
- రెండు వయిపుల కాలిన తరువాత తెసుకొని వేడి వేడిగా తినాలి .
No comments:
Post a Comment