Top Food Blogs

Tuesday, January 3, 2012

AKKII ROTTE [ BIYYAM ROTTE ]

అక్కీ రొట్టె = అక్కి  రొట్టె  అంటే  బియ్యం  రొట్టె ఇది  కర్ణటక లో  ఎక్కువ  చేసుకుంటారు  ఇది  ఒక  టిఫిన్  ఐటెం.కూరగాయలు  తినని పిల్లలలకు ఇలా చేసి పెట్టండి బాగుంటుంది.
కావలిసిన పదార్థములు = 
  1. బియ్యం పిండి - 1 glass
  2. పచ్చికోబ్బెర - 1 cup 
  3. పచ్చిమిరపకాయ ముక్కలు - 2 tsp (or) 3 chillies
  4. క్యారట్ - 1 తురుముకోవాలి 
  5. ఉల్లి కాడలు - ఒక చిన్న కప్ 
  6. ఉల్లిగడ్డ - 1 సన్నగా తరుగుకోవాలి 
  7. కరివేపాకు - కాస్త 
  8. కొత్తిమీర - కాస్త
  9. ఉప్పు - తగినంత 
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట  ఒక గ్లాస్ నీరు పొయ్యిమీద పెట్టుకొని కాగనియ్యాలి.
  • ఒక పళ్ళెములో  తురుము కున్న పచ్చికోబ్బెర,క్యారట్,తరుగుకున్న పచ్చిమిరప,ఉల్లిగడ్డ ముక్కలు,ఉల్లికాడ ముక్కలు,బియ్యంపిండి, ఒక అర చెంచ జీలకర్ర కరివేపాకు,కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని .
  • బాగా కలుపుకొని  సరిపడ మొదట  పొయ్యిమీద     కాగడానికి  పెట్టుకున్న  నీరు[తగినంత]  వేసుకొని ఇంకా బాగా కలుపుకొని .
  • ఒక పెన్నము  తీసుకొని  ఒక  చెంచ నూనె  వేసుకొని మొదట తడుపుకున్న పిండి చిన్న చిన్న వుల్లెలు తీసుకొని పెన్నము   మీద  పెట్టుకొని  వత్తుకొని..................
  • మల్లి  ఒక  చెంచ  నూనె  వేసుకొని  మూత   మూసుకొని  పొయ్యి  ముట్టించుకొని  రెండు వయిపుల  కాల్చుకోవాలి  అంతే  ఎంతో  రుచి కరమయిన అక్కి  రొట్టె  తయ్యార్.......................



No comments:

Post a Comment