Top Food Blogs

Tuesday, January 3, 2012

PERUGU ANNAMU [ CURD RICE ]

పెరుగు అన్నము = చలువ ఐన  వంట  ఎంతో  రుచిగా  వుంటుంది . చేద్దాము .

కావలిసిన   పదార్థములు - 
  • అన్నము - ముoదే వండుకొని  పెట్టుకోవాలి .[1 glass]
  • పాలు - ఒక  గ్లాస్
  • పెరుగు - ఒక 1/2 liter
  • పచ్చిమిరపకాయ  ముక్కలు - 4 ముక్కలు చేసి పెట్టుకోవాలి 
  • మిరియాలు - 6
  • అల్లము ముక్కలు - 1 tsp 
  • కొత్తిమీర - కాస్త
  • నూనె - 2 tsp 
  • తిరవాత  గింజలు - మినప బేడలు-1/4 tsp,శనగ బేడలు- 1/4 tsp,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు 
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట  అన్నము లో  ఉప్పు వేసుకొని మెత్త గా చేసుకొని పెట్టుకోవాలి .
  • పెన్నము  పెట్టుకొని  నూనె వేసుకొని కాగినాక  తిరవాత గింజలు వేసుకొని  వేగినాక  మిరపకాయ ముక్కలు,అల్లము ముక్కలు,మిరియాలు వేసుకొని కాస్త వేగినాక పొయ్యి ఆఫ్ చేసుకొని అన్నములో వేసుకొని పాలు,పెరుగు  వేసుకొని కలిపి చివరికి  కొత్తిమీర  వేసుకొని మరి కలిపి ఆరగించండి .
ద్రాక్షా పండ్ల కాలములో  కలుపుకున్న పెరగన్నములో  ద్రాక్షాలు  వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment