Top Food Blogs

Friday, December 23, 2011

KAKARAKAYA PACHHADI [ FOR RICE ]

కాకరకాయ పచ్చడి = ఈ పచ్చడి ఎంతో రుచిగా వుంటుంది.
ఇది పాతకాలం పచ్చడి ,కాబట్టి రుచి కూడా కమ్మగా చాలా బాగుంటుంది అవుతే చేద్దామా.
కావలిసిన 

  1. కాకరకాయలు - 2
  2. టమోటా పండ్లు - 5 
  3. ఉల్లిగడ్డలు - 2 
  4. చింతపండు - కాస్త 
  5. ఉప్పు - తగినంత 
  6. ఒట్టి కారము - 2 tsp 
  7. ఆవాలపొడి - 1 tsp 
  8. మెంతి పొడి - 1 tsp 
  9. పుదిన - ఒక పది ఆకులు 
  10. కరివే పాకు,ఆవాలు,జీలకర్ర, శనగబేడలు,ఒట్టిమిరపకాయలు(2) - తిరవాతకి
  11. ఎల్లిపాయలు - 8 [సన్నవి పొట్టు తీసుకొని]
  12. నూనె - ఒక 5 tsp 
తాయారు చేసుకునే పద్ధతి = 


  • మొదట  కాకరకాయలు చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని పెన్నములో ఒక రెండు చెంచాల నూనె వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి.


  • తరువాత  పక్కన వేరే  పెన్నములో  ఒక చెంచ నూనె వేసుకొని ఉల్లిగడ్డలు టమోటా పండ్ల ముక్కలు వేసుకొని మగ్గ బెట్టుకొని కాస్త చింతపండు వేసుకొని పెట్టుకోవాలి.
  • చల్లారినాక  మిక్సీ లో వేసుకొని,సరిపడా ఉప్పు  వేసుకొని తిప్పుకొని  ఈ గుజ్జు కుక వేయించుకున్న కాకర కాయల గిన్నలో వేసుకోవాలి.
  • దీనిలోనే కారము,ఆవాలపొడి,మెంతి పొడి,ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి .
  • తరువాత  పెన్నము  పెట్టుకొని మిగిలిన నూనె వేసుకొని తిరవాత అంత వేసుకొని చివరికి పుదిన వేసి ఒక సరి కలిపి తాయారు చేసుకున్న కాకరకాయ గుజ్జు కూడా వేసుకొని ఒక  అయిదు నిముషములు బాగా వేయించుకొని పొయ్యి బంద్ చేసుకోవాలి .

అంతే  ఎంతో రుచి కరమయిన కాకర కయ పచ్చడి తయ్యార్ . వేడి వేడి అన్నములో తిని ఆనందించండి .
  •    

No comments:

Post a Comment