Top Food Blogs

Thursday, December 22, 2011

KAKARA KAYA MUKKALA TALIMPU [ PACHHI KARAM ] ANNAMU LOKI

కాకరకాయ తాలింపు = 
ఈ  కాకరకాయలు  ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక రకము కాకరకాయ ప్రియులకు ఇది చాలా నచ్చుతుంది.కాబట్టి చేసి చూడండి...........................


కావలిసిన పదార్థములు =  

  • కాకరకాయలు - 3
  • ఉల్లిగడ్డ - 1
  • పచ్చిమిరపకాయలు - 7 [తగినన్ని]
  • ఉప్పు 
  • ఒట్టి కొబ్బెర - కాస్త 
  • చెక్కర - 1tsp
  • నూనె - 6 tsp 
తాయారు చేసుకునే పద్ధతి :- 

  • మొదట కాకర కాయలు చెక్కు తీసుకొని ఒక సరి కడిగి   సన్నగా ముక్కలు చేసుకోవాలి .
  • తరువాత  పెన్నము  పెట్టుకొని నూనె వేసుకొని కాకరకాయలు వేసుకొని 
  • మధ్యస్తపు  మంట మీద వేయించుకోవాలి, మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి.
  • అర్ధము వేగినాక తరుగుకున్న ఉల్లిగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి
  • బాగా  వేగినాక 
  • మిక్సీ లో ఉప్పు,పచ్చిమిరపకాయలు,ఒట్టి కొబ్బెర అన్ని కలిపి తిప్పుకోవాలి.
  • ఈ తిప్పుకున్న కరము వేయించుకున్న కాకరకయలల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక అయిదు నిముషములు తరువాత పొయ్యి బంద్ చేసుకోవాలి తరువాత ఒక చెంచ వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి అంతే.
ఎంతో  రుచి  గా వుండే కాకరకాయ కూర తయార్ ..........


No comments:

Post a Comment