Top Food Blogs

Friday, December 16, 2011

PEAS PARATHA

పచ్చి బఠానీల పరోట = 
ఇది చేయడానికి ఒక పది నిముశముల సమయము పడుతుంది.చేయడము సులబము ఆరోగ్యానికి మంచిది,పిల్లలు బఠానీలు తినమంటే తినరు కానీ ఇలా చేసి చూడండి మరి ............


కావలిసిన పదార్థములు :- 
  • శనగపిండి - 1 tsp 
  •  క్యారట్  - 1 [ఉడకబెట్టుకోవాలి ]
  • పచ్చి బఠానీలు - 200 grms
  •  పచ్చి మిరపకాయలు - 3
  • అల్లము - కాస్త  
  • కొత్తిమీర - ఒక కప్పు
  • జీలకర్ర - 1 tsp 
  • ధనియాల పొడి - 1 tsp 
  • నూనె - కాల్చుకోవడానికి 
  • గోధుమ పిండి - 1 glass

తాయారు చేసుకునే పద్ధతి = 
మొదట  పచ్చి బఠానీలు,క్యారట్ ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకోవాలి.
పక్కన పచ్చిమిరపకాయలు,అల్లము,ఉప్పు,కొత్తి మీర అన్ని కలిపి మిక్సీ  వేసుకొని ..........
గోధుమపిండి లో ఒక స్పూన్  నూనె  వేసుకొని తాయారు పైన చేసుకున్న కారము వేసుకొని తగినంత నీరు వేసుకొని చపాతీ పిండి లా తడుపుకొని పెట్టుకోవాలి.
 అప్పుడు ఇలా వుంటుంది
తారువాత పక్కన పెన్నములో ఒక స్పూన్ నూనె  వేసుకొని జీలకర్ర వేసి చిటపట అని అన్నాక శనగపిండి  వేసి వేయించుకొని [సన్న మంట మీద]ధనియాల పొడి వేసి


 తరువాత  మెత్తగా  చేసుకున్న పచ్చి బఠానీల పేస్టూ  వేసుకొని  [కావాలి అంటే చిటికెడు  చాలు పిండిలో  ఉప్పు వుంది కాబట్టి] బాగా కలుపుకొని  దించి పక్కన పెట్టుకోవాలి



చపాతీ  పెన్నము పొయ్యి మీద పెట్టి ముట్టించుకొని  
చపాతీ పిండి  కాస్త తీసుకొని కాస్త వత్తుకొని  మధ్యలో బఠానీల పేస్టు పెట్టుకొని 

అంత  మూసి ..........
కాస్త వట్టి  పిoడి వేసుకొని పరోట వత్తుకొని  పెన్నము మీద వేసుకొని 
తగినంత నూనె వేసుకొని రెండు వయిపుల కాల్చుకొని పెరుగుతో కానీ  ఏదన్న పచ్చడి తో కానీ ఆరగించండి ........










No comments:

Post a Comment