Top Food Blogs

Tuesday, December 13, 2011

TAMOTA VANKAYA PACHHADI [ WITH RICE ]

టమోటా కాల్చిన వంకాయ పచ్చడి = 
వంకాయ టమోటా పచ్చడి ఇది అన్నములోకి  చాలా బాగుంటుంది చేసి చూడండి.
కావలిసిన పదార్థములు -

  • బర్త వంకాయ [లావు వంకాయ]-1
  • టమోటా పండ్లు - 4
  • పచ్చి మిరపకాయలు - 6 
  • కొత్తిమీర - ఒక రెండు రూపాయలది 
  • ఉప్పు - తగినంత 
  • నునే - 10 tsp
  • తిరవాత గింజలు -                                            శనగ బేడలు - 1tsp ,మినప బేడలు - 1/2 tsp, ఆవాలు- 1/4 tsp,జీలకర్ర -1/4 tsp, కరివేపాకు,ఇంగువ[చిటికెడు]  
తాయారు చేసుకునే పద్ధతి =

  • మొదట వంకాయని గాట్లు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని తిప్పి తిప్పి కాల్చుకోవాలి.
  • చల్లారినాక పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా........
  • పక్కన పొయ్యి మీద పెన్నము పెట్టుకొని ఒక రెండు చెంచాల నూనె వేసుకొని కాగినాక పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త వేయించుకొని టమోటా పండ్ల ముక్కలు వేసుకొని బాగా మగ్గబెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ...............
  • టమోటాలు చల్లారినాక మిక్సీ లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి.
  • తరువాత  మొదట పొట్టు తీసుకున్న వంకాయను కదా తీసివేసుకొని  ఈ తిప్పుకున్న టమోటా గుజ్జు లో వేసుకొని ......................
  • మరిఒక సారి తిప్పుకొని ,పక్కన పెన్నము పెట్టుకొని తగినంత నూనె వేసుకొని కాగినాక చెప్పుకున్న తిరవాత వేసుకొని వేగినాక
  •  మిక్సీ లో తిప్పుకున్న పచ్చడి వేసుకొని సన్న మంట మీద బాగా కలుపుకొని ఒక అయిదు నిముషములు వుంచుకొని తరువాత దించుకోవాలి .
  • అంతే  పచ్చడి తయ్యార్....................... వేడి వేడి అన్నములోకి కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తినండి చాలా బాగుంటుంది .



No comments:

Post a Comment