సన్న కారాలు - ఇవి చాలా బాగుంటాయి .సన్నగా వుంటాయి కాబట్టి తయారు చేయడము కూడా తొందరగా అవుతుంది .
ఇవి చేసి పెట్టుకుంటే ఒక 20 రోజులు అయిన బాగుంటాయి
కావలిసిన పదార్థములు =
చేసుకునే పద్ధతి =
కావలిసిన పదార్థములు =
- శనగ పిండి - 3 చిట్లు [పైన చూపించినదే చిట్టి అంటే]
- నూనె - 1/2 cup
- ఈ చూపించిన కప్పు కొలతకి చెప్పేది .
- ఉప్పు - తగినంత
- సోడ పొడి - చిటికెడు [cooking soda powder]
- బియ్యం పిండి - 1/2 చిట్టి
- జీలకర్ర పొడి - 1 tsp [బాగా మెత్తగా వుండాలి]
- ఎర్ర కారము - 1 tsp [బాగా మెత్తగా వుండాలి]
- నూనె - 1/2 liter [వారి వారి పెన్నము కి సరిపడా అంటే బజ్జీలు, వేయించుకోవడానికి వేసుకునేంత]
- ఒక పెద్ద ప్లేట్ లో శనగ పిండి జెల్లిపోసుకొని,
- దానిలో బియ్యం పిండి,ఉప్పు,కారము,జీర పొడి,సోలాపొడి, వేసుకొని [బాగా మెత్తగా వుండాలి అంటే అన్ని కలిపి జెల్లడ వేసుకోవాలి]
దీనినే సన్న జెల్లడ అని అంటారు.దీనిలో జెల్లి చేసుకుంటే పిండి ,కారము అన్ని బాగా వుంటుంది .
- తరువాత 1/2 cup నూనె పెన్నములో వేసుకొని బాగా కాగ బెట్టుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
- తరువాత తగినంత నీరు పోసుకొని పిండి తడుపుకొని [పిండి చపాతీ పిండి కంటే కొంచము లూస్ గ వుండాలి]
కారల పావు లో పెట్టుకోవాలి
కారాల పావు రకరకాలుగా వుంటుంది ఇది ఒక రకము దీనిలో పెట్టుకునే బిళ్ళ ఇలా వుండాలి , అంటే సన్న బోర్రలది అన్నమాట ...................
- తడుపుకున్న పిండి ఈ కారల గొట్టములో పెట్టుకొని
- పొయ్యి మీద పెన్నములో కారాలు వేయించుకోవడానికి నూనె పెట్టుకొని కాగనియ్యాలి నూనె బాగా కాగినాక మద్యస్తపు మంట మీద కారాలు వత్తుకోవాలి, రెండు వయిపుల కాల్చుకోవాలి .ఒకొక్క చుట్ట కాలడానికి అయిదు నిముషములు పడుతుంది.
కోవాలి , ఒక నిముషము తరువాత ఇంకొక సైడ్ కి తిప్పుకోవాలి .
చుట్ట వత్తు కొని కాలేటప్పుడు నూనె నురుగు వస్తుంది కాస్త , ఎప్పుడు అవుతే నురుగు పోతుందో అప్పుడు చుట్ట అయినట్టే తీసివేయండి .
No comments:
Post a Comment