Top Food Blogs

Wednesday, December 7, 2011

LAVU VANKAYA LO ELLIPAYA KARAMU

   
బర్త వంకాయ = దీనినే బర్త వంకాయ అని అంటారు మీరు చూసే వుంటారు ,మొన్న నేను కొంటె ఒకరు అడిగినారు ఎలా చేస్తారు మీరు అని ఇలా అని చేస్తారు మీకు తెలియ కుంటే చేసుకోండి .............


పూర్వము  ఆనకాగు లు ఉండేవి,ఇప్పుడు లేవు అప్పుడు ఆనకాగులో  వంకాయలు  మగ్గ బెట్టుకొని తినే వారు మరి ఇప్పుడు కాగులు  పోయినాయి వంకాయలు పోయినాయి.
నేను  ఇలా చేసినాను బాగుంది, మీరు చేయండి మా అత్తగారికి తన చిన్నతనము గుర్తు వచ్చింది మరి మీకు ...


కావలిసిన పదార్థములు = 

  • బర్త వంకాయ : ఒకటి 
  • ఒట్టి కారము : 1/2 tsp 
  • ఉప్పు : తగినంత 
  • ఎల్లిపాయలు : 4 
  • ఒట్టి కొబ్బెర : కాస్త 
తయారు చేసుకునే పద్ధతి = 

  • మొదట వంకాయ తీసుకొని కడిగి తుడచండి.
  • తరువాత చాకు తో వంకాయ ను పొడవండి.[గాట్లు పెట్టుకోవాలి]
  • గాట్లు పెట్టుకున్నాక  పొయ్యి మీద పెట్టుకని కాడ పట్టు కొని  తిప్పి తిప్పి కాల్చుకోవాలి ఇలా ..........
  • కాలినాక  వంకాయని  పొట్టు తీసుకొని ఇలా      ..........
  • కాడను చాకుతో కోసి తీసివేయాలి .
  • తరువాత మిక్సీ లో ఉప్పు,కారము,ఎల్లిపాయలు,ఒట్టి కొబ్బెర అన్ని వేసుకొని 
మిక్సీ పట్టుకొని  ఆ  కారము ఒక గిన్నలో వేసుకొని కాడ కోసినాక  మగ్గిన  వంకాయను  ఈ కారము  వేసుకున్న గిన్నలో వేసి..........
 రెండు కలిసేలా చేతితో కానీ చెంచ తో కానీ బాగా కలుపుకొని ....................
వేడి  వేడి  అన్నములో నెయ్యి  వేసుకొని  ఈ వంకాయ కలుపుకొని తింటే  చాల బాగుంటుంది .

1 comment: