మెంతి కూర పప్పు - అన్నము లోకి రోటి లోకి ఎంతో బాగుంటుంది ఈ దాల్ ,ఉత్త మెంతి ఆకు అని చెడు వస్తది అని అనుకువద్దు చాల రుచి గా వుంటుంది .
కావలిసిన పదార్థములు =
పచ్చిమిరపకాయలు : ఒక అయిదు (or) సరిపడా
మెంతి కూర : ఒక కట్ట [వలిచి బాగా రెండు సార్లు కడగండి]
పసుపు : కాస్త
తిరవాత కు : ఒక చెంచ నూనె,ఎల్లిపాయలు, ఆవాలు,జీలకర్ర,ఎల్లిపాయలు,కరివేపాకు
ఉప్పు : సరిపడ
చింతపండు : అర నిమ్మకాయ అంత [తగినంత]
చేసుకునే పద్ధతి =
కావలిసిన పదార్థములు =
కంది బేడలు : ఒక కప్పుఉల్లిగడ్డ : ఒకటి
పచ్చిమిరపకాయలు : ఒక అయిదు (or) సరిపడా
మెంతి కూర : ఒక కట్ట [వలిచి బాగా రెండు సార్లు కడగండి]
పసుపు : కాస్త
తిరవాత కు : ఒక చెంచ నూనె,ఎల్లిపాయలు, ఆవాలు,జీలకర్ర,ఎల్లిపాయలు,కరివేపాకు
ఉప్పు : సరిపడ
చింతపండు : అర నిమ్మకాయ అంత [తగినంత]
- మొదట చింతపండు కడిగి కాస్త నీటి లో నానా బెట్టుకోండి పప్పు అయి పోయే లోపల బాగా నని చింతపండు కరెక్ట్ గా పడుతుంది.
- తరువాత కుక్కర్ లో కందిబేడలు వేసుకొని కడిగి ఒక కప్పుకు రెండు కప్పు ల నీరు పోసుకొని దీనిలో మొదటే కడుగుకున్న మెంతికూర,ఉల్లిగడ్డముక్కలు,మిరపకాయ ముక్కలు కాస్త పసుపు వేసుకొని మూత ముసి విసిల్ పెట్టుకొని ముట్టించుకోవాలి ఒక మూడు విసిల్లు వచ్చినాక దించు కోవాలి .
- విసిల్ తీయడానికి వచ్చినాక తిగినంత చింత పండు, ఉప్పు వేసుకొని పప్పుగుట్టితో ఎనుపుకోవాలి ఇలా .....
ఈ కట్టే నే పప్పుగుత్తి అని అంటారు .
- బాగా ఎనుపుకున్న తరువాత పక్కన పెన్నము మీద నూనె వేసుకొని తిరువత పెట్టుకోవాలి మొదట ఎల్లిపాయలు వేగినాక మినప,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు అన్ని వేసుకొని వేగినాక ఏనుపు కున్న పప్పులో వేసుకొని
- వడ్డిన్చుకొంటే సరి ...........
No comments:
Post a Comment