Top Food Blogs

Thursday, October 20, 2011

SARVA TAPILENTU [ JONNAPINDI THO CHESUKUNETIVI ]

 
సర్వ తపిలెంటు [ జొన్నపిండి తో చేసుకునేటివి ] :-
ఇవి చాల ఆరోగ్య కరమయిన బలమయిన ఆహారము , ఇవి  టిఫ్ఫెన్  లా  చేసుకునేటివి , చాలా  రుచిగా వుంటాయి  తెలుసా చేసి చూడండి.   
కావలిసిన  పదార్థములు - 
  • జొన్నపిండి - 1 glass 
  • పచ్చి మిరపకాయలు - 10 [ సరిపడ ]
  • కొత్తిమీర - కాస్త 
  • ఉల్లిగడ్డలు - 2
  • ఉప్పు - సరిపడ
  • శనగ బేడలు - 2 tsp
  • జీలకర్ర - 1/4 tsp 
  • కరివేపాకు - 10 ఆకులు 
  • నూనె - వేయించు కోవడానికి [for deep fry ]
  • ప్లాస్టిక్  పేపర్ - పూరీలు వత్తడానికి ఇలా ..........

తాయారు  చేసుకునే పద్ధతి : - 

  (1)  మొదట ఉప్పు,పచ్చి మిరపకాయలు,కొత్తిమీర  మిక్సీ లో వేసుకొని తిప్పుకోవాలి తరువాత  ఈ కారములోనే ముక్కలుగా కట్ చేసు కున్న ఉల్లిగడ్డలు వేసుకొని మరి ఒక సారి తిప్పుకోవాలి [మరీ పేస్టు లాగా వేసుకోకండి ఉల్లిగడ్డ ముక్కలు పూరీలు  నమిలే టప్పుడు బాగుంటుంది]
  (2) తరువాత  పొయ్యి ముట్టించుకొని  పెన్నము[గారాల పెన్నము]{deep fry కి }పెట్టుకొని నూనె వేసు కొని కాగనియ్యాలి 
  (3) పక్కలో ఒక ప్లెట్  తీసుకొని  దానిలో జొన్నపిండి,   మొదట తాయారు చేసుకున్న కారము,కరివేపాకు,
శనగ బేడలు,జీలకర్ర [ కావాలి అనుకుంటే ఒక 4tsp సోర్రకాయ తురుము వేసుకోవచ్చు ]అన్ని వేసుకొని సరిపడ నీరు వేసుకొని చపాతీ పిండి లా తడుపుకొని  చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకొని కావలిసిన  సైజు లో  పల్చగా  లేక కాస్త మందంగా వత్తుకొని
కాగుతున్న  నూనె  లో  వేసుకొని  మద్యస్తపు  మంట  మీద పెట్టుకొని  రెండు  వెయుపులా  కాల్చుకోవాలి .

No comments:

Post a Comment