Top Food Blogs

Friday, October 21, 2011

EGG FRIED RICE

 
ఎగ్ ఫ్రైడ్ రైస్ = ఎప్పుడు  కూరలు,పప్పు  ఇవేనా  బోర్  కదా  అందుకే  అప్పుడప్పుడు  ఇలా  ఫ్రైడ్  రైస్  చేసుకుంటూ వుండాలి తెలుసా  మరి చేసుకుందామా .................

కావలిసిన  పదార్థములు  : - 
  1. మొదట  అన్నము  చేసుకుందాము -

  • మామూలు అన్నము అయిన  చేసుకోవచ్చు లేక పోతే బాసుమతి  రైస్  అయినా  చేసుకోవచ్చు   
[ ఏ అన్నము అయినా కాస్త బిరుసుగా చేసుకోండి ,వేడి వేడి అన్నముతో ఫ్రైడ్ రైస్ చేసుకోకూడదు ]
  • బాసుమతి  రైస్  తాయారు  చేసుకునే పద్ధతి - 1/2 hr
 ముందర  నాన  బెట్టుకొని  పొయ్యి మీద  [ఎసరు పెట్టుకోవాలి]కాస్త పెద్ద గిన్నలో  1 glass అన్నానికి   నాలుగు   గ్లాస్సుల నీరు వేసుకోవాలి  నీరు  బాగా  మరుగు తున్నప్పుడు  ముoదరే  నాన  బెట్టుకున్న  బియ్యము  నీళ్ళు వంచేసుకొని  మరుగుతున్న నీటిలో వేసుకోవాలి తరువాత సన్న మంట పెట్టుకోవాలి మద్య మద్య లో కలుపుతూ వుండాలి ఒక పది నిముషముల అయిన తరువాత బొర్రల గిన్నలో[చిల్లుల గిన్నలో] వేసుకోవాలి 
పైన  చల్ల నీళ్ళు వేసుకోవాలి అప్పుడు ఏమయినా గంజి వుంటే పోతుంది ...........

ఫ్రైడ్ రైస్ కు కావలిసిన వస్తువులు  : -

  1. గుడ్లు - 5 
  2. పచ్చి మిరపకాయలు - 4 
  3. ఉప్పు - తగినంత 
  4. నూనె - 15 tsp 
  5. ఎర్ర కారము - 1 tsp 
  6. టమోటా పండ్లు - 2 
  7. ఉర్లగడ్డలు - 2  
  8. ఉల్లిగడ్డలు  - 2 
  9. అల్లము - కాస్త ,కొత్తిమీర - కాస్త ,ఎల్లిపాయ - 2 [అన్నికలిపి  పేస్టు చేసుకోవాలి] 
తాయారు చేసుకునే పద్ధతి = 
మొదట  గిన్న లో నూనె  వేసుకొని  కాగినక  సన్నగా ముక్కలు చేసుకున్న ఉర్లగడ్డలు,ఉల్లిగడ్డలు  వేసుకొని 
వేగినాక  అల్లము  కొత్తిమీర పేస్టు వేసుకొని వేగినాక పచ్చిమిరపకాయ  ముక్కలు  టమోటాలు వేసుకొని మగ్గినాక ఉప్పు,ఒట్టి కారము అన్ని  వేసుకొని  బాగా వేగినాక  మొదటే   చేసుకున్న  అన్నము  వేసుకొని  కలుపుకుని పోయి  మీద  పెట్టుకొని  వేడి  చేసుకొని  వడ్డిoన్చుకోవాలి .

కావాలి  అంటే  మిరియాల పొడి వేసుకోవచ్చు  బాగుంటుంది .


No comments:

Post a Comment