Top Food Blogs
Showing posts with label lakshmi. Show all posts
Showing posts with label lakshmi. Show all posts

Tuesday, November 22, 2011

BREAD GRILL SANDWITCH

బ్రెడ్ స్యన్డ్విచ్ = ఇది ఒక స్నాక్  . ఇది పిల్లలకి పెద్దలికి అందరికి నచ్చుతుంది చేయడము సులబము ,అవుతే చేసుకుందామా .


కావలిసిన పదార్థములు =

  • బ్రెడ్ - ఒక నాలుగు 
  • బట్టర్ - ఒక చెంచ 
  • కీర దోసకాయ - ఎనిమిది ముక్కలు 
  • టమోటా పండ్లు - ఒకటి ముక్కలు చేసుకోవాలి 
  • ఉల్లిగడ్డ ముక్కలు - ఎనిమిది ముక్కలు 
  • కాప్సికం - సన్నగా గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి 


కారము తాయారు చేసుకునే విధానము = 


పుదిన,ఉప్పు,కాస్త చెక్కర ,కాస్త కొత్తిమీర,ఒక పచ్చిమిరపకాయ అన్ని  వేసుకొని మిక్సీ లో వేసుకొని పేస్టు చేసుకొని పెట్టుకోవాలి .


తాయారు చేసుకునే పద్దతి = 
మొదట  కూరగాయలు అన్ని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి .
తరువాత గ్రిల్ ఆన్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి .
తరువాత బ్రెడ్ మీద వెన్న పూసి కూరగాయ ముక్కలు పెట్టుకొని ఇంకొక  స్లయిస్స్  మీద తాయారు చేసుకున్న పుదిన చట్నీ పూసుకొని [కావాలి అంటే ఇంకా ఆలు ఉడక బెట్టుకొని పొట్టు తీసి మెత్తగా చిదిమి తగినంత ఉప్పు,కాస్త కారము వేసుకొని ఆ  కూరను కూడ మద్య లో పెట్టుకోవచ్చు]








తరువాత ఒక బ్రెడ్ మీద ఇంకొక బ్రెడ్ మూసి గ్రిల్ 
మూసుకొని టోస్ట్ చేసుకోవాలి ఇలా అంతే ఏంటో రుచి కరం అయిన వెజ్ టోస్ట్ తయ్యార్ ..........

Thursday, October 20, 2011

SARVA TAPILENTU [ JONNAPINDI THO CHESUKUNETIVI ]

 
సర్వ తపిలెంటు [ జొన్నపిండి తో చేసుకునేటివి ] :-
ఇవి చాల ఆరోగ్య కరమయిన బలమయిన ఆహారము , ఇవి  టిఫ్ఫెన్  లా  చేసుకునేటివి , చాలా  రుచిగా వుంటాయి  తెలుసా చేసి చూడండి.   
కావలిసిన  పదార్థములు - 
  • జొన్నపిండి - 1 glass 
  • పచ్చి మిరపకాయలు - 10 [ సరిపడ ]
  • కొత్తిమీర - కాస్త 
  • ఉల్లిగడ్డలు - 2
  • ఉప్పు - సరిపడ
  • శనగ బేడలు - 2 tsp
  • జీలకర్ర - 1/4 tsp 
  • కరివేపాకు - 10 ఆకులు 
  • నూనె - వేయించు కోవడానికి [for deep fry ]
  • ప్లాస్టిక్  పేపర్ - పూరీలు వత్తడానికి ఇలా ..........

తాయారు  చేసుకునే పద్ధతి : - 

  (1)  మొదట ఉప్పు,పచ్చి మిరపకాయలు,కొత్తిమీర  మిక్సీ లో వేసుకొని తిప్పుకోవాలి తరువాత  ఈ కారములోనే ముక్కలుగా కట్ చేసు కున్న ఉల్లిగడ్డలు వేసుకొని మరి ఒక సారి తిప్పుకోవాలి [మరీ పేస్టు లాగా వేసుకోకండి ఉల్లిగడ్డ ముక్కలు పూరీలు  నమిలే టప్పుడు బాగుంటుంది]
  (2) తరువాత  పొయ్యి ముట్టించుకొని  పెన్నము[గారాల పెన్నము]{deep fry కి }పెట్టుకొని నూనె వేసు కొని కాగనియ్యాలి 
  (3) పక్కలో ఒక ప్లెట్  తీసుకొని  దానిలో జొన్నపిండి,   మొదట తాయారు చేసుకున్న కారము,కరివేపాకు,
శనగ బేడలు,జీలకర్ర [ కావాలి అనుకుంటే ఒక 4tsp సోర్రకాయ తురుము వేసుకోవచ్చు ]అన్ని వేసుకొని సరిపడ నీరు వేసుకొని చపాతీ పిండి లా తడుపుకొని  చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకొని కావలిసిన  సైజు లో  పల్చగా  లేక కాస్త మందంగా వత్తుకొని
కాగుతున్న  నూనె  లో  వేసుకొని  మద్యస్తపు  మంట  మీద పెట్టుకొని  రెండు  వెయుపులా  కాల్చుకోవాలి .

Friday, September 23, 2011

PANNER PAROTA

పన్నీర్ పరోట =
ఇది ఓకే  టిఫిన్  ఐటెం  ఏంటో  రుచుగా, కమ్మగా వుంటుంది చేసి  చూడండి.
పరోట తయారుకి కావలిసిన పదార్థములు =
1. 
  • గోధుమపిండి - 2 cups 
  • ఉప్పు - 1/4 tsp 
  • నూనె - 1/2 tsp 
పైన చెప్పినవన్నీ ఒక పళ్ళెములో వేసుకొని  చేపతి పిండిలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి .
2. 
  • పన్నీరు - 100 grms [ పన్నీరు  ఒక  పది నిముషాలు వేడి నీటిలో  వేసుకొని  తీసి  తురుముకుంటే  మితువుగా వుంటుంది ]
  • ఉప్పు - తగినంత 
  • పచ్చిమిరపకాయలు - 4 [ సన్నగా  తరుగుకొని  పెట్టుకోవాలి ]
  • మిరియాలు - 8 [పొడి చేసుకొని పెట్టుకోవాలి ]
  • కొత్తిమీర - కొంచము [సన్నగా తరుగుకొని వేసుకోవాలి ]
  • నిమ్మకాయ - 1/4 tsp రసము 
  • ఉల్లిగడ్డ - 1 సన్నగా తరుగుకొని వేసుకోవాలి 
తాయారు చేసుకునే పద్ధతి = 
పైన  చెప్పినవన్నీ ఒక గిన్నలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి .
తరువాత  మొదటే తడుపుకున్న చెపాతి పిండి చిన్న వుల్లెలు చేసుకొని పెట్టుకోవాలి 
ఒకవుల్లె వత్తుకొని మద్యలో ఈ పన్నీర్ తురుము పెట్టుకోవాలి ఇలా 
పెట్టుకున్న తరువాత ఇలా ముసుకోవాలి 
మూసుకుంటే  ఇలా  వుంటాది
తరువాత  ఇలా  వత్తుకుని  కాలుతున్న  పెంనము  మీద  వేసుకొని నూనె  వేసుకొని రెండు వాయిపుల  కాల్చుకోవాలి 

అంతే ఎoతో రుచి కర మయిన పన్నీర్  పరోట తయ్యార్ ......