పన్నీర్ పరోట =
ఇది ఓకే టిఫిన్ ఐటెం ఏంటో రుచుగా, కమ్మగా వుంటుంది చేసి చూడండి.
పరోట తయారుకి కావలిసిన పదార్థములు =
1.
- గోధుమపిండి - 2 cups
- ఉప్పు - 1/4 tsp
- నూనె - 1/2 tsp
పైన చెప్పినవన్నీ ఒక పళ్ళెములో వేసుకొని చేపతి పిండిలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి .
2.
- పన్నీరు - 100 grms [ పన్నీరు ఒక పది నిముషాలు వేడి నీటిలో వేసుకొని తీసి తురుముకుంటే మితువుగా వుంటుంది ]
- ఉప్పు - తగినంత
- పచ్చిమిరపకాయలు - 4 [ సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి ]
- మిరియాలు - 8 [పొడి చేసుకొని పెట్టుకోవాలి ]
- కొత్తిమీర - కొంచము [సన్నగా తరుగుకొని వేసుకోవాలి ]
- నిమ్మకాయ - 1/4 tsp రసము
- ఉల్లిగడ్డ - 1 సన్నగా తరుగుకొని వేసుకోవాలి
పైన చెప్పినవన్నీ ఒక గిన్నలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి .
తరువాత మొదటే తడుపుకున్న చెపాతి పిండి చిన్న వుల్లెలు చేసుకొని పెట్టుకోవాలి
ఒకవుల్లె వత్తుకొని మద్యలో ఈ పన్నీర్ తురుము పెట్టుకోవాలి ఇలా
పెట్టుకున్న తరువాత ఇలా ముసుకోవాలి
మూసుకుంటే ఇలా వుంటాది
తరువాత ఇలా వత్తుకుని కాలుతున్న పెంనము మీద వేసుకొని నూనె వేసుకొని రెండు వాయిపుల కాల్చుకోవాలి
అంతే ఎoతో రుచి కర మయిన పన్నీర్ పరోట తయ్యార్ ......
No comments:
Post a Comment