ఇది బియ్యము రవ్వతో చేస్తారు ఎప్పుడు ఒకే మాదిరి ఉప్మ చేస్తే ఎవరికీ ఇష్టము వుండదు అందుకే రకరకాల ఉప్మాలు చేస్తున్నారు ఇప్పుడు , కానీ మన అమ్మ అమ్మమలు ఏంటో రుచికరమయిన వంటలు రకాలు చేసుకునే వారు అలాంటిదే ఈ రకము నేను మా అమ్మ దెగ్గర నేర్చుకున్నాను మీకు చెపుతాను మీరు నేర్చుకొని చేసి చూడండి.
కావలిసిన వస్తువులు =
- బియ్యము - 2 glasses
- శనగబేడలు - 1/2 glass [మిక్సీ లో రవ్వ లాగా వేసుకోవాలి {గోధుమ రవ్వ ఉక్మ రవ్వలాగ వుండాలి }సన్న జల్లెడతో జల్లి వేసుకుంటే కింద పిండ వస్తుంది అది శనగపిండి ల బజ్జిలకు వాడుకోవచ్చు ]
మొదట బియ్యము రెండు సార్లు బాగా కడిగి నీరు అంత వంచేసి [బొర్రలు వున్నా గిన్నలో వేసి పెట్టుకోవాలి]దానివల్ల నీరు బాగా పోతుంది అప్పుడు ఒక బట్ట మీద ఆరవేసుకోవాలి ఒక ఆరు గంటలు .
తరువాత మిక్సీకి వేసుకొని నైస్ జెల్లడ వేసుకుంటే దానిలోని నైస్ బియ్యపిండి కిందికి వస్తుంది రవ్వ పక్కకి వస్తుంది ఇలా ...................
రవ్వ పోను మిగిలిన బియ్యప్పిండి డబ్బాలో వేసుకొని పక్కకు పెట్టుకోండి దానిని దోసలకి,మౌత్కడి కి ఇలా రకరకా లుగా వాడుకోవచ్చు దీనిగురించి మల్ల చూదాము .
ఉప్మా తయ్యరుకు కావలిసిన పదర్తములు =
- రవ్వ [బియ్యము]- 11/4 glass
- శనగ బేడల రవ్వ - 1/4 glass
- నూనె - 10 (or) 15 tsp
- ఉప్పు - తగినంత
- ఒట్టి కారము - 1/4 tsp
- జీలకర్ర - 1/2 tsp [కచ్చా పచ్చా గా దంచుకోవాలి]
- నిమ్మకాయ - 1
- తిరవాత గింజలు - 2 tsp [ఆవాలు,జీలకర్ర,మినప,శనగ బేడలు,కరివేపాకు]
తాయారు చేసుకునే విధానము =
వేసుకొని వేగినాక 11/2 glass రవ్వకు 31/2 నీరు వేసి
జీలకర్ర పొడి,ఉప్పు,కారము వేసి మరగనీయాలి.
జీలకర్ర పొడి,ఉప్పు,కారము వేసి మరగనీయాలి.
- తరువాత తయారు చేసుకున్న రవ్వ వేసుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద ఒక పది నుంచి పదిహేను నిముషాలు మగ్గబెట్టుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి .
- మగ్గినాక స్టవ్ బన్ద చేసుకోవాలి .
చిన్నది అవుతే ఒక నిమ్మకాయ రసము పిండుకొని బాగా కలుపుకొని ఆరగించండి .
గమనిక : శనగబేడల బదులు కందిబేడలు వేసి రవ్వ చేసుకోవచ్చు రుచి లో తేడ వుండదు .
No comments:
Post a Comment