Top Food Blogs

Thursday, September 22, 2011

VAKKHAYALA PULUSU

వాక్కాయల పులుసు - వాక్కాయలు  వీటిని  ఉప్పింకాయలు  అని కూడా అంటారు ,ఇవి  పుల్లగా వుంటాయి  ఇవి  వర్ష కాలములో  దొరికే  మామిడికాయల  లాంటివి  అన్నమాట . ఈ వక్కయాల పులుసు  తియ్య గా
పుల్లగా  కంమ్మగా  వుంటుంది .

పులుసుకు  కావలిసిన  పదార్థములు - 
  • వాక్కాయలు - 10 [పచ్చి కాయలని చాకుతో మధ్యకు కట్ చేసుకొని గింజలు{విత్తనాలు}తీసుకొని ,గింజలు పరవేసుకొని వక్కయాలని ఒక గ్లాస్ నీటిలో ఉడక బెట్టుని పక్కన పెట్టుకోవాలి ]
  • చింతపండు - నిమ్మ కయ అంత [ పులుపు సరిపడా]నాన  బెట్టుకొని గుజ్జు తీసుకోవాలి 
  • ఉల్లిగడ్డలు - 2 [ సంబారు కు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని 1/2 గ్లాస్ నీరు పోసుకొని  కోకేర్ లో ఒక విసిల్ రానిచ్చాలి ]
  • ఉప్పు - తగినంత
  • బెల్లము - తగినంత 
  • పచ్చిమిరపకాయలు - 4 
  • ఒట్టి  మిరపకాయలు - 4 
  • ఇంగువ - చిటికెడు [కాస్త]
  • తిరవాత గింజలు - [ఆవాలు,జీలకర్ర,మినపబేడలు] అన్నికలిపి 1/2 tsp 
  • నూనె - 2 tsp 
  • బియ్యపిండి - 3 tsp [1/2 glass నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి]
  • ఎల్లిపాయలు - 10 పాయలు 
తాయారు చేసుకునే పద్దతి - 
    మొదట  ఒక గిన్న పెట్టుకొని  నూనె వేసుకొని కాగినాక ఎల్లిపాయలు వేసుకొని  రెండు నిముశముల తరువాత తిరవాత గింజలు,కరివేపాకు,ఇంగువ వేసుకొని  వేగినాక  ముక్కలుగా  చేసుకున్న  పచ్చి ,ఒట్టి మిరపకాయలు వేసి  కాస్త  వేగినాక  మొదటే  ఉడక బెట్టుకున్న  ఉల్లిగడ్డలు,వాక్కాయలు [వుడక బెట్టుకున్న నీటి తో సహ] వేసుకొని  ఉప్పు,బెల్లము,చింతపండు గుజ్జు,పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి , ఉడుకుపట్టినక నీటిలో కలుపుకున్న బియ్యపిండి  వేసుకొని బాగా కలుపుతూ వుండాలి ఒక పది నిముషాల తరువాత దించుకుంటే సరి ...

    ఎంతో  రుచికరమయిన  వాక్కయల  పులుసు  అన్నములోకి 
    ఆరగించండి ....................

    No comments:

    Post a Comment