ఎగ్ కర్రీ కి కావలిసిన పదార్థములు =
- నూనె - 3/4 cup
- తిరవాత గింజలు - 1 tsp [ అవ్వలు,జీలకర్ర ]
- ఉల్లిగడ్డలు - 4 [పెద్దవి]
- పుదిన - 1 కట్ట
- కరివేపాకు - 15 ఆకులు
- అల్లము వెల్లుల్లి పేస్టు - 2 tsp
- టమోటాలు - 3 [ paste ]
- ఉప్పు - తగినంత
- ఎర్రకారము - 1 tsp
- పన్నీర్ - 9 ముక్కలు [సన్నగా కట్ చేసినవి]
- గుడ్లు : [eggs] - 5
మొదట 4 గుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి ,తరువాత పక్కన పెట్టుకున్న ఉడకబెట్టని
ఒక గుడ్డు ఒక గిన్నలో పగలగొట్టి వేసుకొని గిలకొట్టాలి [beat] బాగా ,తరువాత కట్ చేసుకున్న ఎగ్గ్స్ డీప్ చేసి కాగుతున్న ఆయిల్ లో వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని పన్నీర్ ముక్కలని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి .
టమోటా పండ్లు ముక్కలు చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి .
ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి .
అల్లము వెల్లుల్లి పేస్టు చేసుకొని పెట్టుకోవాలి .
కూర తయ్యారు చేసుకునే పద్దతి =
ఒగ గిన్నలో 3 tsp నూనె వేసుకొని కాగినాక ఆవాలు,జీలకర్ర వేసుకొని రెండు నిముషాలు తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఎర్రగా వేగినాక పచ్చిమిరపకాయల ముక్కలు ,ఉప్పు,కారము,కడిగి పక్కన పెట్టుకున్న పుదిన ఆకులు వేసి బాగా కలుపుకొని కరివేపాకు ,అల్లము వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా వేయించుకోవాలి [సన్న మంట మీద]తరువాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక అయిదు నిముషాలు మగ్గబెట్టుకోవాలి .
తరువాత టమోటా పేస్టు ,ఉప్పు,కారము వేసి మల్ల ఫ్ర్య్ చేసుకోవాలి ,చివరికి వేయించుకున్న గుడ్లు ,పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపు కొని చివరికి కొత్తిమీర వేసి దించుకొని వడ్డిoన్చుకోవాలి .
ఈ కూర చాపాతిలోకి చాల బాగుంటుంది
>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<
No comments:
Post a Comment