ఎగ్ కర్రీ గ్రేవి =
ఈ కర్రీ చేపతి లోకి ,అన్నములోకి చాలా బాగుంటుంది చేసి తిని చూడండి.
అవుతే నేర్చుకుందామా
కావలిసిన పదార్థములు :
- గుడ్లు - 6
- ఉల్లి గడ్డలు - 5 (లేక) 6
- టమోటా పండ్లు - 2
- అల్లము ఎల్లిపాయల పేస్టు - 1 tsp
- పచ్చిమిరపకాయలు - 4
- ఉప్పు
- ఎర్రకారము - 1/2 tsp
- కరివేపాకు - 10 ఆకులు
- కొత్తిమీర - కాస్త
- చింతపండు - కాస్త [ ఒక గోరిస ]
మొదట గుడ్లు కుక్కర్ లో ఒక రెండు విసిల్లు రానిచ్చి దించుకోవాలి .
మొదట పెన్నములో మూడు స్పున్ ల నూనె వేసుకొని
ఆవాలు,జీలకర్ర వేసుకొని చిటపట అని అన్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ,మధ్యలోకి కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఒక 8 నిముషములు వేగిన తరువాత అల్లమువేల్లుల్లి పేస్టు వేసి వేయించుకొని తరువాత టమోటా ముక్కలు,ఉప్పు, ఏర్ర కారము వేసి బాగా కలుపుకొని కరివేపాకు వేసి ఒక అయిదు నిముషముల తరువాత ఒక గ్లాస్ నీరు పోసుకొని
మూత మూయవలెను ,ఒక పది నిముషములు మధ్యస్థము మంట మీద మగ్గినాక మొదటే వుడకబెట్టుకున్న గుడ్లు పొట్టు తీసుకొని చాకు తో గాట్లు పెట్టుకొని ఉడుకుతున్న కూరలొ వేయవలెను ,
చివరికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దిన్చుకోవలెను అంతే ఎంతో రుచికరమయిన ఎగ్ కర్రీ తయ్యార్ ............................
No comments:
Post a Comment