Top Food Blogs

Tuesday, October 18, 2011

NUGULA VANKAYA PULUSU [ CURRY ]

నూగుల  వంకాయ  పులుసు = ఈ  పులుసు  తియ్యగా  కాస్త పుల్లగా  కమ్మగా వుంటుంది  ఇది  జొన్న  రొట్టేలోకి, అన్నము లోకి  చాలా  బాగుంటుంది .పుల్క లోకి కూడా తినవచ్చు .

అవుతే  దీనిని  చేసుకుందామా ......................... పదండి ముందు  సామగ్రి  ఒక  దగ్గర చేర్చుకున్దాము.

కూరకు  కావలిసిన  పదార్థములు - 
  • వంకాయలు - 1/2 kg
  • తెల్ల  నూగులు - 1/2 glass [150 grms]
  • వేయించి పొట్టు తీసుకున్న చనక్కాయలు - 1/4 glass    [100 grms ]
  • ఒట్టి  మిరపకాయలు - 8(or)10 [తినే కారము బట్టి ]
  • ధనియాలు - 3 tsp 
  • చింతపండు - నిమ్మకాయ అంత [నాన బెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి ]
  • ఉప్పు - తగినంత 
  • బెల్లము - ఒక నిమ్మకాయ అంత [తగినంత]
  • ఉల్లి గడ్డలు - 3 
  • నూనె - 3 tsp 
-మొదట  నూగులు,ధనియాలు,ఒట్టిమిరపకాయలు విడి విడిగా వేయించుకొని మిక్సీ లో  అవసరమయినన్ని నీరు 
వేసుకొని  పేస్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి .
-చింతపండు  ఒక  గ్లాస్ నీటిలో  నాన బెట్టుకొని  గుజ్జు చేసుకొని  పెట్టుకోవాలి .
-వంకాయలు పయిన కాడలు  తీసుకొని  బొడ్డు దెగ్గర నాలుగు గాట్లు  పెట్టుకొని [పురుగులు లేకుండా చూసుకోవాలి]ఉప్పు నీటిలో  వేసుకోవాలి నసరు వాసన రాకుండా ఉండటానికి .
- ఉల్లిగడ్డలు నిలువుగా కాస్త లావుగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి .

తాయారు చేసుకునే పద్దతి = 
పెన్నములో  నూనె వేసుకొని కాగినాక వుల్లిగడ్డ ముక్కలు వేసి  రెండు నిముషాలు వేగిన తరువాత మొదట తయారు  చేసుకున్న నూగుల  గుజ్జు వేసు కొని  ఒక అయిదు నిముషాలు వేయించుకున్న తరువాత వంకాయలు,కాస్త పసుపు వేసి బాగా కలిపి తగినంత ఉప్పు,చింతపండు గుజ్జు,బెల్లము,ఒక గ్లాస్ నీరు వేసుకొని బాగా కలిపి మూత  పెట్టి ఒక పదినిముషాల తరువాత కలిపి సన్న మంట   మీద ఉడికించుకోవాలి [కావాలి అంటే కాస్త నీరు వేసుకోండి] వంకాయలు బోడ్డు కాడ ఉడికినది అంటే  కూర దించుకోండి. 

కూర మరీ నీళ్ళ గా వుండ కుండ చూసుకోండి .


No comments:

Post a Comment