Top Food Blogs
Showing posts with label sri. Show all posts
Showing posts with label sri. Show all posts

Wednesday, October 12, 2011

EGG CURRY [ GRAVY BOILED { PUDINA MIX} ]

ఎగ్ కర్రీ కి కావలిసిన పదార్థములు = 
  • నూనె - 3/4 cup 
  • తిరవాత గింజలు - 1 tsp [ అవ్వలు,జీలకర్ర ]
  • ఉల్లిగడ్డలు - 4 [పెద్దవి]
  • పుదిన - 1  కట్ట 
  • కరివేపాకు - 15 ఆకులు 
  • అల్లము వెల్లుల్లి పేస్టు - 2 tsp 
  • టమోటాలు - 3 [ paste ]
  • ఉప్పు - తగినంత 
  • ఎర్రకారము - 1 tsp 
  • పన్నీర్ - 9 ముక్కలు [సన్నగా కట్ చేసినవి]
  • గుడ్లు : [eggs] - 5 
తాయారు చేసుకునే పద్దతి = 

మొదట 4 గుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి ,తరువాత పక్కన పెట్టుకున్న ఉడకబెట్టని 
ఒక గుడ్డు ఒక గిన్నలో పగలగొట్టి వేసుకొని గిలకొట్టాలి [beat] బాగా ,తరువాత కట్ చేసుకున్న ఎగ్గ్స్ డీప్ చేసి కాగుతున్న ఆయిల్ లో వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని పన్నీర్ ముక్కలని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి .

టమోటా  పండ్లు ముక్కలు చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి .

ఉల్లిగడ్డలు సన్నగా  కట్  చేసుకొని పెట్టుకోవాలి .

అల్లము వెల్లుల్లి పేస్టు చేసుకొని పెట్టుకోవాలి .

కూర తయ్యారు చేసుకునే పద్దతి =
ఒగ గిన్నలో 3 tsp నూనె వేసుకొని కాగినాక ఆవాలు,జీలకర్ర వేసుకొని రెండు నిముషాలు తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఎర్రగా వేగినాక పచ్చిమిరపకాయల ముక్కలు ,ఉప్పు,కారము,కడిగి పక్కన పెట్టుకున్న పుదిన ఆకులు వేసి బాగా కలుపుకొని కరివేపాకు ,అల్లము వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా వేయించుకోవాలి [సన్న మంట మీద]తరువాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక అయిదు నిముషాలు మగ్గబెట్టుకోవాలి .
తరువాత టమోటా పేస్టు ,ఉప్పు,కారము వేసి మల్ల ఫ్ర్య్ చేసుకోవాలి ,చివరికి వేయించుకున్న గుడ్లు ,పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపు  కొని చివరికి కొత్తిమీర వేసి దించుకొని వడ్డిoన్చుకోవాలి .

ఈ  కూర  చాపాతిలోకి  చాల  బాగుంటుంది 

>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<

Sunday, September 25, 2011

TOMATO BAJJILU / FRITTERS

టమాటో బజ్జి = ఇది  ఒక  స్నాక్  ఐటెం.పిల్లలు పెద్దవాళ్ళు అందరు బాగా నచ్చే  రకం ఎంతో సులువు 
                                            ఎంతో రుచి .ఎమoటారు చేసి చూస్తారు కదా మరి ఇoక ఎందుకు ఆలస్యము మొదలు    
                                               పెట్టండి మరి ...............................
కావలిసిన పదార్థములు = 
>> టమోటా పండ్లు - [నాటివి పుల్లగా వుంటాయి ,పులుపు ఇష్టపడే వాళ్ళు అవి వాడండి లేదు అంటే హైబ్రిడ్వి వాడండి]
పండు గట్టిగ వుoటే బాగుంటుంది మెత్తవి అవుతే నీరు ఎక్కువ వస్తుంది .
>> పచ్చిమిరపకాయలు - 7
>> కొత్తిమీర
>> ఉప్పు 
>> పచ్చి కొబ్బెర - కాస్త 
>> నూనె - బజ్జీలు కాల్చడానికి 
>> సోలా పొడి  - చిటికెడు [ cooking soda ]

తాయారు చేసుకునే పద్దతి  =
మొదట టమోటా పండ్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి [చక్రాల మాదిరి].
పచ్చి మిరపకాయలు,ఉప్పు,కొబ్బెర[కాస్త],కొత్తిమీర[కాస్త]
అన్ని కలిపి మిక్సీ లో వేసుకొని ఆ కారమును టమోటా ముక్కాలా మీద ఇలా పెట్టాలి ,
శనగపిండి,తగినంత ఉప్పు,సోలా పొడి,నీరు తగినంత అన్ని వేసి కలుపుకొని [చిక్కగా బజ్జీల పిండిలాగా]
పెన్నములో నూనె  వేసి కాగినాక ఈ కారము పెట్టుకున్న టమోటా ముక్కలు కలుపుకున్న శనగ పిండి మిశ్రమములో అద్ది నూనె లో వేసి కాల్చుకోవాలి అంతే టమోటా బజ్జీలు తయ్యార్.................