Top Food Blogs

Wednesday, October 12, 2011

SAGGU BIYYAM DOSA [ KOBEERA CHATNEE ]

సగ్గు బియ్యం దోస కొబ్బెర చట్నీ = 

ఇది ఒక టిఫిన్ ఐటెం ఈ దోస చిన్న పెద్ద అందరికి చాలా నచ్చుతుంది , ఇది కమ్మగా కాస్త పుల్లగా వుంటుంది కాస్త అప్పం లాగా వుంటుంది చేసి చూడండి.

సగ్గు బియ్యం దోస తయారుకు కావలిసిన వస్తువులు = 
  • సగ్గు బియ్యం - 1 glass
  • బియ్యం - 4 glasses 
  • పెరుగు - 1 glass 
  • సోడా  పొడి - 1/4 tsp [cooking soda]
  • ఉప్పు - 2 tsp
తాయారు చేసుకునే పద్దతి = 
  • బియ్యము రెండు సార్లు కడిగి నీరు పోసి పక్కన పెట్టుకోవాలి .(6 గంటలు నానబెట్టుకోవాలి)
  • సగ్గు బియ్యము ఒక సారి కడిగి పెరుగు పోసి నానబెట్టుకొని పక్కనపెట్టుకోవాలి [సగ్గుబియ్యము మునిగే వరకు పెరుగు వేసుకోవాలి కొలతకు తక్కువ అవుతే కాస్త నీరు వేసుకోని పెట్టుకోండి ](4 గంటలు నానబెట్టుకోవాలి)

note - సగ్గు బియ్యము,మామూలు బియ్యము విడి విడిగా నాన బెట్టుకోవాలి .
తరువాత బియ్యము మాత్రము  మిక్సీ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా[దోస పిండి లాగా]

తరువాత ఈ తయారు అయిన పిండి, నాన  బెట్టుకున్న సగ్గుబియ్యము లో వేసి కలుపుకోవాలి ఇలా 

ఈ పిండి ముందురోజే  తయ్యారు చేసి పెట్టుకోవాలి. 
మరునాడు ఉదయము దీనిలో ఉప్పు తగినంత,సోడా పొడి 
వేసి కాలుపుకోవాలి నీళ్ళు సరిపడా వేసుకొని నీల్లగా కలుపుకోవాలి ఇలా ....................
తరువాత గారాల పెన్నము పొయ్యి మీద పెట్టుకోవాలి పెన్నము కాలినాక ఒక రెండు గంటలు పిండి వేసి పెన్నాన్ని తిప్పాలి ఇలా ..............


తరువాత పొయ్యి మీద పెట్టి నూనె వేసి సన్న మంట మీద కాల్చుకోవాలి ఇలా ..............


దీనిని చట్నీ తో తింటే బాగుంటుంది .........


చట్నీ తయ్యరికి కావలిసిన పదార్థములు = 
  • పచ్చి కొబ్బెర - 1/2 చిప్ప 
  • పచ్చిమిరపకాయలు - 4 
  • పప్పులు [ పుటానీలు ]- 1/2 cup 
  • కొత్తిమీర - కాస్త 
  • ఉప్పు - తగినంత
  • అల్లము - రెండు చిన్న ముక్కలు 
  • నూనె - 1/2 tsp 
  • తిరవాత  గింజలు - [ఆవాలు,జీలకర్ర,మినప బేడలు]-1/2 tsp 
తాయారు  చేసుకునే  పద్ధతి = మొదట కొబ్బెర ముక్కలు చేసుకొని ఉప్పు ,మిరపకాయలు,పప్పులు అన్ని మిక్సీలో వేసుకొని కాస్త నీళ్ళు వేసుకొని మిక్సీ లో తిప్పి కాస్త మెత్తపడినాక కాస్త కొత్తిమీర వేసుకొని మల్ల తిప్పుకొని గిన్నలో వేసుకొని పక్కన పెన్నములో నూనె వేసుకొని తిరవాత గింజలు వేసుకొని వేగినాక చివరికి కరివేపాకు వేసి వేగినాక చట్నీలో వేసుకోవాలి అంతే చట్నీ తయ్యార్ ...........

No comments:

Post a Comment