Top Food Blogs
Showing posts with label lalli. Show all posts
Showing posts with label lalli. Show all posts

Thursday, December 1, 2011

BENDAKAYA PULUSU [ ANNAMU LOKI (or) PULKA LOKI ]

బెండకాయ పులుసు = బెండకాయ పులుసు ఇది అన్నములోకి బాగుంటుంది .తియ్యగా కాస్త పుల్లగా వుంటుంది ,కారము వుండదు కాబట్టి చిల్లపిల్లలకు కూడా బాగుంటుంది చేద్దామ్మ మరి పదండి ..............


కావలిసినవస్తువులు = 

  • బెండకాయలు - 8
  • పచ్చిమిరపకాయలు - 5
  • ఉల్లిగడ్డలు - 2 మరి పెద్దవి కాదు 
  • చింతపండు గుజ్జు - 2 tsp 
  • బెల్లము - తీపు తినగాలిగినంత 
  • తాలింపు గింజలు - మినపబేడలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు
  • పప్పులపొడి {పుట్నాల పొడి}- 4 tsp 
  • ఉప్పు - తగినoత 
తాయారు చేసుకునే పద్దతి = 
మొదట ఉల్లిగడ్డలు ,పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకోవాలి .
చింతపండు కడిగి నీటిలో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి.


గిన్న పెట్టుకొని  రెండు చెంచాల నూనె వేసుకొని తిరవాత వేసుకొని ఉల్లిగడ్డలు ,పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ..........


  తరువాత ముక్కలు చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒక నిముషము వేగినాక ఒక గ్లాస్ నీరు పోసి కాస్త ఉప్పు, పసుపు,బెల్లము వేసుకొని మూత మూసుకొని సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి బెండకాయలు వుడికిన తరువాత 
 చింతపండు పులుసులో పప్పుల పొడి వేసుకొని [బాగా కలుపుకోవాలి]ఉడుకు తున్న బెండకాయల పులుసు లో వేసి .................
తగినన్ని నీరు వేసుకొని [చిక్కగా ఉండేలాగా వుండాలి]సాంబార్ కంటే చిక్కగా వుండాలి . ఒక్క ఉడుకు వచ్చేవరకు వుంచి దించాలి అంతే బెండకాయ పులుసు తయ్యార్ ......................

Wednesday, November 23, 2011

GODUMA GARALU [SWEET]

కావలిసిన పదార్థములు =

      • గోధుమ పిండి - 3 glasses పిండి 
      • బెల్లము - 2 glasses [ఒకటే కొలత గ్లాస్ పెట్టుకోవాలి]
      • నీరు - ఒక గ్లాస్ 
      • నూనె - వేయించుకోవడానికి [deep fry]
తాయారు చేసుకునే పధ్ధతి = 


మొదట ఒక గిన్నలో నీరు,బెల్లము వేసుకొని కలుపుతూ వుండాలి బెల్లము కరిగినాక పొయ్యిమీద నించి దించుకొని గోధుమపిండి  వేసుకొని [పాకు వేడిగానే వుండాలి]బాగా కలుపుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఒక నాలుగు అయిదు గంటల తరువాత పొయ్యి మీద పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక ఒక ప్లాస్టిక్ పేపర్ మీద చిన్న చిన్న వుల్లెల్లు చేసుకొని గుడ్రంగా [కాస్త మందముగా వత్తుకోవాలి అప్పుడు బాగా పొంగుతాయి]
వత్తుకున్న గారెలు నూనె లో వేసుకొని కాల్చుకోవాలి [గోధుమ రంగులో వుండే లాగా చూసుకోవాలి]అంతే గారెలు తయ్యార్.......................