Top Food Blogs

Thursday, April 18, 2013

CORIANDER / KOTTIMERA CHUTNEY - FOR RICE


కొత్తిమీర  తో  పచ్చడి  అది  ఒక పది  రోజులు  కూడా  నిలువ  వుంటుంది  . ఇది  అన్నములోకి , వేడి వేడి  బియ్యం  రవ్వ  ఉప్మాకు   చాలా  చాలా  బాగుంటుంది . చేయడము  చాలా  సులువు  రుచి  అంటారా  చాలా  బాగుంటుంది . మరి  నేర్చుకుందామా . 

కావలిసిన  వస్తువులు - 

  • కొత్తిమీర - 1 గిన్న {కట్ట  పెద్దది}
  • ఒట్టి  మిరపకాయలు - 10 
  • ఉప్పు - తగినంత 
  • చింతపండు గుజ్జు - 4 tsp 
తిరవాత   గింజలు - 
  • శనగ బేడలు - 2 tsp 
  • మినపబేడలు - 1 tsp 
  • ఆవాలు - 1/3 tsp 
  • జీలకర్ర - 1/ 3 tsp 
  • ఇంగువ - చిటికెడు 
  • నూనె  - 5 tsp 
తయారు  చేసుకునే  విధానము - 

కొత్తిమీర  కడిగి  బొర్రల గిన్నలో  వేసుకోవాలి .  ఒక  అరగంట  తరువాత  మిక్సీ  జార్  లో  వేసుకొని   కొత్తిమీర , ఉప్పు , ఒట్టిమిరపకాయలు  వేసుకొని  కాస్త  చింతపండు  గుజ్జు  వేసుకొని  మెత్తగా  తిప్పుకోవాలి . 

ఒక  పెన్నము   పొయ్యి  మీద  పెట్టుకోవాలి  కగినాక  తగినంత  నూనె   వేసుకొని  కాగినాక  , తిరవాత  వేసుకొని వేగినాక  చివరికి  ఇంగువ  వేసుకొని  సన్న మంట  మీద  తాయారు చేసుకున్న  పచ్చడి  వేసుకొని  బాగా  కలుపుకోవాలి . 

ఒక 5 నిముషములు  తరువాత  పొయ్యి బంద్   చేసుకొని  ఒక  గిన్నలోకి   తీసుకోవాలి . 

ఇది  అన్నములోకి  , ఉప్మ  అదే అండి   బియ్యము రవ్వ  ఉప్మా  లోకి  చాలా  చాలా   బాగుంటుంది . 

note - ఈ  పచ్చడికి  చింతపండు ,ఉప్పు  ఎంత  కావాలో  చూసుకొని  వేసుకోండి . 
 

No comments:

Post a Comment