Top Food Blogs

Friday, February 15, 2013

MASALA VANKAYA [FOR JONNA ROTTE & CHAPATHI]

మసాలా వంకాయ - ఇది  జొన్న  రొట్టె  కు  , చెపాతికి  బాగుంటుంది  చేసుకోవడం  కూడా  అంత  కష్టము  కాదు కావట్టి  చేసుకుందాము ....................................

కావలిసిన  పదార్థములు - 
  • వంకాయలు - 1/2 kg 
  • ఉల్లిగడ్డలు - 3 
  • నూనె  - 6 tsp 
  • అల్లము - 1/2 ఇంచ్ 
  • గసగసాలు - 4 tsp 
  • నూగులు  - 1/2 చిట్టి 
  • చనక్కాయలు - 5 tsp  [వేయించి పొత్తు తీసుకోవాలి] 
  • కొత్తిమీర - కాస్త 
  • ఒట్టి  కారము  - 1 tsp 
  • ఉప్పు - 1/2  tsp 
  • బెల్లము - 1/2 tsp 
  • ఎల్లిపాయలు - 5 
  • లవంగాలు - 2
  • చెక్క - కాస్త 
  • ఒట్టి  కొబ్బెర - తురుము - 4 tsp 
  • టమోటాలు  - 2 
తయారు  చేసుకొనే  పద్ధతి - 

వంకాయలు  సన్నవి తీసుకొని  మధ్యలో  నాలుగు  భాగాలుగా  చేసుకొని  కాస్త ఉప్పు వేసుకున్న  నీటిలో  వేసుకొని  పెట్టుకోండి 

ఉల్లిగడ్డలు  పొట్టు తీసుకొని  కడిగి  సన్న  ముక్కలు  చేసుకొని  పెట్టుకోండి .
  • గసాలు , నూగులు విడి విడి గా  వేయించుకోవాలి ,
  • తరువాత  వేయించుకున్న  చేన్నక్కాయలు , నూగులు , గసాలు   మిక్సీ  జార్  లో వేసుకొని  మెత్తగా  తిప్పుకొని దానిలో  ...........................
  • ఇంక  చెక్క , లవంగాలను  ఒక  చుక్క  నూనే  వేసుకుంటే  వేసుకొని   వేయించుకొని  పొడి చేసుకొని పెట్టుకోండి ,
  • ఒక  బాణలిలో  ఒక  5 tsp  నూనే  వేసి  తరుగుకున్న   ఉల్లిగడ్డ  ముక్కలు  వేసుకొని  వేయించుకోవాలి, ఒక బాగము ఉల్లిగడ్డలు , ఇంక  నూగులు తిప్పుకున్న మిక్సీ  జార్   లో ఈ  ఉల్లిగడ్డలు   వేసుకొని 

  • ఇంక   ఒట్టి కారము  , ఉప్పు , అల్లము, కొత్తిమీర,ఒట్టికోబ్బెర  ఎల్లిపాయలు వేసుకొని    మెత్తగా [కాస్త నీళ్ళు  వేసుకొని ] తిప్పుకోండి 

  • ఇప్పిడు   మిగిలిన  ఉల్లిగడ్డ  లల్లో  ఈ తయారు చేసుకున్న  మసాలా  వేసుకొని   మధ్యస్థం  మంట  మీద  వేయించుకొని  ...................

  • తరువాత  ముక్కలుగా   చేసుకున్న  వంకాయలు   వేసుకొని   ఒక  9 నిముషములు   వేయించుకొని 


  •  తర్వాత   ముక్కలు  గా  చేసుకున్న  టమోటా  ముక్కలు వేసుకొని  బాగా   కలిపి  ఒక  గ్లాస్ నీళ్ళు వేసుకొని  బాగా కలిపి   మూత  మూసి  వుడికిన్చుకోండి .

  • కావాలి అంటే  కాస్త బెల్లము వేసుకొని  ఒక 5 నిముషములు  వుడికిన్చుకోండి .
NOTE   -  ఉప్పు , కారము      ఎవరి  రుచికి  తగ్గట్టు వారు  వేసుకోండి రుచి  చూసి   వేసుకోండి  .

PS:Please leave a comment once you are done.
      Thank You!
ammachethiruchi.blogspot.com

No comments:

Post a Comment