Top Food Blogs

Wednesday, February 13, 2013

EGG PANNER CURRY {MASALA}

కావలిసిన  పదార్థములు - 

  1. కోడి గుడ్లు - 4 
  2. ఉల్లిపాయ - 1 + 1
  3. టొమాటో  - 2
  4. వేల్లులుల్లి  - 4 
  5. అల్లం  - 1/2  inch 
  6. పచ్చిమిరపకాయలు  -  4
  7. ఒట్టి  కారము - 1/2 tsp 
  8. పసుపు - 1/4 tsp 
  9. ధనియాలపొడి  - 1/2 tsp 
  10. గరం మసాలా  -  1/3 tsp 
  11. నూనె   -  2  tsp 
  12. పన్నీర్  -  1 కప్  [ తురుము ] 
  13. పాలు  - 1 కప్ 
  14. ఉప్పు - తగినంత 
తయారు చేసుకుందాము - 
  • మొదట  కోడి గుడ్లను   ఉడికించి  పొత్తు  తీసుకొని  గాట్లు  పెట్టు కొని  పక్కన  పెట్టుకోవాలి .
  • 1 - ఉల్లి ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు , అల్లము , పచ్చిమిరపకాయలు  కలిపి  మెత్తగా  రుబ్బుకొని   పెట్టుకోవాలి .
  • బాణలి  పెట్టుకొని  నూనె  వేసుకొని  కాగినాక  కాస్త  జీలకర్ర  వేసుకొని వేగినాక  మిగిలిన   ఒక  ఉల్లిగడ్డ  ముక్కలుగా  చేసుకొని వేసుకొని  వేయించుకోవాలి {బంగారు వర్ణములోకి }
  • తరువాత  తయారు చేసుకున్న  మాసాలను వేసుకొని   ఒక 5 నిముషములు   వేయించుకొని  తరువాత  టమోటా  ముక్కలు  వేసుకొని  బాగా కలిపి  , 
  • పసుపు , ఉప్పు  , కారము  వేసుకొని  సన్న మంట మీద  మగ్గనిచ్చాలి  
  • టమోటాలు  మగ్గినాక  ధనియాల పొడి  వేసుకొని గాట్లు పెట్టుకున్న గుడ్లు  వేసుకొని  బాగా  కలిపి  ఒక  నిముషము  మూత   మూసుకొని  
  • తరువాత  పాలు  పోసుకొని  బాగా  కలిపి  పన్నీర్   తురుము వేసుకొని  బాగా కలిపి  {కావాలి అంటే ఒక  1/2 గ్లాస్ నీరు  పోసుకొని వుడికించండి}
  • ఒక  5- 9 నిముషముల  తరువాత   గరం మసాలా  వేసుకొని  బాగా  కలిపి  పొయ్యి బంద్  చేసుకొని  కొత్తిమీర , వుంటే ఉల్లికాడలు   వేసుకొని  రోటి  కి కాని  చపాతీ  కి  కాని   వడ్డించండి .

PS:Please leave a comment once you are done.
      Thank You!
ammachethiruchi.blogspot.com

No comments:

Post a Comment