మామిడికాయ తో ఎన్నో రకాల పచ్చడ్లు చేసుకుంటారు ఇది ఒక పాత కాలం వంట చేయడం సులువే అన్నము లోకి ,ఉప్మా లోకి చాలా బాగుంటుంది చేసి చూడండి ....................
కావలిసిన పదార్థములు -
- ఒట్టి మిరపకాయలు - 6
- మినపబేడలు - 1 tsp
- శనగ బేడలు - 1 tsp
- మెంతులు - 1/4 tsp
- ఆవాలు - 1/4 tsp
- మామిడికాయ ముక్కలు - 6
- పచ్చి మిరపకాయలు - 3
- జీలకర్ర - 1/4 tsp
- నూనే - 3 - 6 tsp
- చేన్నకాయలు - 5 - 8 tsp [ వేయించి పొత్తు తీసుకొని పెట్టుకోండి ]
మొదట పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని కాస్త నూనే వేసుకొని మెంతులు ,ఆవాలు ,జీలకర్ర, మినపబేడలు ,శనగబేడలు,ఒట్టి మిరపకాయలు అన్ని వేయించుకోవాలి
ఒక పల్లెము లో తీసుకొని ..............................
ఒక పెన్నము తీసుకొని దానిలో పచ్చిమిరపకాయలు వేసుకొని
మిక్సీ లో వేయించుకున్న వన్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మామిడికాయలు వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి [ కావలి అంటే కాస్త నీరు వేసుకోవచ్చు ]
మెత్తగా తిప్పుకున్న పచ్చడి ఒక గిన్నలోకి తీసుకొని మల్ల పొయ్యి ముట్టించుకొని పెన్నము పెట్టుకొని మిగిలిన నూనే వేసుకొని మినపబేడలు ,ఆవాలు ,ఒక ఒట్టి మిరపకాయ వేసుకొని కాస్త ఇంగువ వేసుకొని కలిపి వేగినాక తయారు అయిన పచ్చడి లో వేసుకోవాలి ,తరువాత కలుపోకోవాలి ...........................
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment