Top Food Blogs

Tuesday, December 11, 2012

ALLAM LEHYAM [ FOR GAS TROUBLE OR INDIGESTION ]

అల్లం  లేహ్యము ఇది  ఆరోగ్యకరమయినది  చాయడానికి  కాస్త   సమయము పడుతుంది  అంతే. కానీ  ఎంతో పనికి వచ్చేది  పిల్లలకు పెద్దవాళ్ళకు  అందరికి  చాల చాల మంచిది  అరుగుదల లేనివాళ్ళు కాని గ్యాస్  ట్రబుల్   తో బాధపడుతున్నవాళ్ళు  కాని  దీనిని  తీసుకుంటే  ఎంతో మంచిది  .

ఇది  ఒక  పాత కాలము  వంట  నేను చిన్నప్పుడు  మా  ఎదురు ఇంట్లో  వున్నా  మా ఫ్రెండ్ వాళ్ళ  తాత గారు  ఇచ్చేవారు  [maarvaadis ] మల్ల మా వారి                   స్నేహితుడు  వాళ్ళ  అమ్మగారు  పంపితే  తిన్నాను  నాకు నడుము నోస్తూ ఉన్నింది అది ఈ లేహ్య ము  తిన్న రెండు రోజులకు తగ్గింది  అడిగి కనుక్కొని చేసినాను  మీకు చెపుదామని రాసినాను .

ఆ ఆంటీ  కి చాల చాలా  థాంక్స్ 

ఉదయము  కాఫీ  టిఫిన్ తిన్నతరువాత  ఒక  ఉసిరికాయ అంత  లేహ్యము తీసుకుంటే  ఎంతో మంచిది తినడానికి తియ్యగా రుచుగా వుంది కదా  అని ఎక్కువ తీసుకోకండి  ఒకే సారి  కాకుంటే  ఒకసారి అర  ఉసిరికాయ అంత మల్ల సాయంకాలము అలా   మిగిలిన అర తీసుకోండి   [ మరి  చిన్న పిల్లలకి  కాస్త పెట్టండి చాలు ] 

కావలిసిన పదార్థములు - 

అల్లము - 250 grms 
ధనియాలు - 25 grms 
జీలకర్ర - 25 grms 
బెల్లము - 250 grms 
నెయ్యి - 70 grms 

చేసే  విధి =  

  • ముందు  రోజు  రాత్రి  అల్లము  బాగా  కడిగి  మంచి  నీల్లల్లో  నానబెట్టుకోవాలి .
  • అలాగే  జీలకర్ర ,ధనియాలు  కూడా  ఒక సారి కడిగి  మంచి నీటిలో  నానబెట్టాలి .
  • ఉదయము  అల్లము  మీద తోలు  తీసి  మల్ల  ఒకసారి శుభ్రంగా  కడిగి [తోలు తీసేటప్పుడు  మల్ల కాస్త గలిజు  వుంటుంది కదా అందుకే మల్ల మంచి నీళ్ళతో  కడగటము]

  •   చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ లో  మెత్తగా  పేస్టు  చేసుకోవాలి [బాగా  మెత్తగా  చేసుకోండి ]  నీళ్ళు  వేసుకోవచ్చు పేస్టు  చేసుకోవటానికి .  

  • ఒక  గిన్నకు  మంద పాటి  బట్ట కట్టి  ఈ రుబ్బుకున్న  అల్లము పేస్టు వేసుకోవాలి  

  • బాగా  పిండాలి  అల్లము రసము అంత కిందకు వచ్చి పిప్పి మాత్రమ బట్టలో ఉండేలా .

  • ఆ రసాన్ని కలించకుండా పక్కన పెట్టండి .
  • పిప్పి  ఇలా  వుంటుంది 

  • అంత లోపలి   నానబెట్టుకున్న   జీలకర్ర ధనియాలు  మెత్తగా  మిక్సీ లో పేస్టు  చేసుకోండి .

  • బెల్లము  దంచి  ఒక అర గ్లాస్  నీళ్ళు  వేసుకొని పొయ్యి మీద  కరగ బెట్టుకోండి , 

  • తరువాత వడ పోయండి  ఎమన్నా ఇసుక  గలీజు  వుంటే  పోతుంది 

  • ఇక  ఒక  nonstick  పెన్నము  పెద్దది  తీసుకొని   ఈ  తయారు చేసుకున్న  జీలకర్ర ,ధనియాల పేస్టు ,బెల్లము నీరు ,బట్టలో  వున్న చెక్క లాగా వున్న  అల్లము  పిప్పి  వేసి బాగా కలపండి  ఇంక
[ నేను  డైరెక్ట్  గా  జీలకర్ర  పేస్ట్  nonstick  పెంనము లో వేసుకొని బెల్లము నీళ్ళు  వదపోసుకున్నాను ఇలా ]



  • చివరికి అల్లము నీరు వుంది కదా  అది కూడా వేసుకోoడి .[నిదానముగా   వేసుకోండి  ఎందుకంటే కింద తెల్లటి డి సున్నములాగా  ఒకటి వుంటుంది అది పారవేయాలి మంచిది కాదు అందుకే  నిదానముగా వేసుకోండి ]


ఈ  కింద  కనపదిస్తున్న  తెల్ల  సున్నము  వేసుకోకూడదు  జాగ్రత్త ......................


  • ఇంక  బాగా  కలిపిన   ఈ మిశ్రమమును  పొయ్యి  ముట్టించి  పెట్టుకొని   కలపండి  [ పెద్ద  మంట మీదనే చేసుకోవచ్చు ]

  • మధ్య   మధ్య  లో కలుపుతూ  వుండండి  
  • కాస్త  చిక్క పడిందంటే  చిట్లుతుంది  కాస్త  మూత  అడ్డం పెట్టుకొని  కలుపుతూ  వుండండి  ఎందుకు అంటే అడుగు అంటుతుంది  చిక్క బడి దెగ్గర పడ్డాక  [ మీకు చేయి నోస్తుంది అంటే పొయ్యి బంద్  చేసుకొని  మల్ల  కాసేపు వున్నా తరువాత  చేసుకోవచ్చు  ఏమి కాదు  ]

  • ఇంకా  గట్టిగ్గా  అయినాక  ................. 

  • నెయ్యి వేసుకొని  కాస్త  మధ్యస్తపు మంట  మీద  కలపండి 

  •  నెయ్యి అంత ఇంకి పోతుంది  మిశ్రమము లోకి 

  • అడుగు అంట కుండా కలుపుతూ వుండండి  అంతే  ఎంతో ఆరోగ్య కర మయిన అల్లం  లేహ్యం  తయ్యారు అవుతుంది  .
  • చల్లారినాక  ఏదన్న డబ్భాలోకి  వేసుకొని  పెట్టుకోండి .  ఒక రండు రోజులు  భయత వున్నా  పరువాలేదు  తరువాత  fridge  లో పెట్టుకోండి .
  • ఒక  చిన్న డబ్భ లో బయట కాస్త పెట్టుకోండి  సరిపోతుంది .
మరి మీరందరూ  కచ్చితంగా  తయారు  చేసుకుంటారని  ఆశిస్తున్నాను . 

No comments:

Post a Comment