కావలిసిన పధర్థములు =
ఉసిరికాయలు - 3
పచ్చిమిరపకాయలు - 6
క్యారట్ - చిన్నవి - 3
టమాటో - 1 [ పెద్దది ]
కొత్తిమీర - కాస్త
చింతపండు - 1/2 inch
ఉప్పు
జీలకర్ర పొడి - 1/2 tsp
ఎల్లిపాయలు - 6
చెక్కర - 1/3 tsp
నెయ్యి - 1 tsp
తాలింపు కు =
మినపబేడలు - 1/2 tsp
ఆవాలు - 1/3 tsp
జీలకర్ర - 1/3 tsp
కరివేపాకు - 5 ఆకులు
ఒట్టి మిరపకాయ - 1
ఇంగువ - చిటికెడు / 1/3 tsp
నూనె - 2 tsp
తయారు చేసుకునే పద్ధతి =
మొదట ఉసిరికాయలను కడిగి లోపలి గింజ లేకుండా ముక్కలు చేసుకోవాలి
టమోటా పండు చిన్న ముక్కలు గా చేసుకొని పెట్టుకోవాలి
క్యారట్ చెక్కు తీసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి
ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి
ఒక పెన్నము తీసుకొని నెయ్యి వేసుకొని ఉసిరికాయ ముక్కలు ,పచ్చిమిరపకాయముక్కలు , క్యారట్ ముక్కలు వేసుకొని ఒక రెండు నిముషములు వేయిన్చుకోనున్న తరువాత
టమోటా ముక్కలు ,ఎల్లిపాయలు కొత్తిమీర వేసుకొని మధ్యస్తపు మంట మీద మగ్గ బెట్టుకోవాలి మూత ముసి
మధ్య మధ్య లో కలుపుతూ వుండండి ఒక 8 mint's తరువాత చింతపండు కూడా వేసుకొని కలిపి మల్ల ఒక 5 mint's మగ్గనీయాలి .
టమోటాలు అన్ని మగ్గినాక పొయ్యి మీద నుంచి దించి చల్లారనిన్చుకోవాలి .
మిక్సీ జార్ లో ఈ చల్లారిన వుసరి క్యారట్ ముక్కలను వేసుకొని , తగినంత ఉప్పు ,చెక్కర ,జీలకర్ర పొడి వేసుకొని కచ్చ పచ్చా గా తిప్పుకొని ఒక గిన్నలోకి తీసుకొని ......
పక్కన ఇంకొక పెన్నము పెట్టుకొని తిరవాతకు నూనె వేసుకొని తాలింపు దిన్సులు ఒకటొకటి వేసుకొని వేగినాక తయారు చేసుకున్న పచ్చడి లో వేసుకొని మూత మూయండి ఒక నిముషము ..........
ఈ పచ్చడి వేడి వేడి అన్నము లో కి ఉప్మా లోకి చాలా బాగుంటుంది .
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment