Top Food Blogs

Friday, November 16, 2012

PESARA BEDALU TOMATO PAPPU / DAL [ FOR RICE ]

పెసర బేడలు  దీనితో  పొంగల్ ,పులగము ఇంకా అన్నము పరమాన్నము లో కి  వాడుతావుంటారు  , కాని మనము ఇక్కడ పప్పు చేసుకుందాము చాలా రుచిగా వుంటుంది .ఈ పెసర  బేడలతో టమోటా పచ్చిమిరపకాయలు  వేసుకొని   పప్పు చేసుకోవడము  చానా రుచిగా వుంటుంది ఒట్టి  కారము తో అంత బాగుండదు [ అది నా  అభిప్రాయము ]

కావలిసిన పదార్థములు =

పెసరబేడలు - 1 కప్ 
టమోటా పండ్లు - 2 చిన్నవి 
పచ్చిమిరపకాయలు - 5 
ఉల్లిగడ్డ - 1 చిన్నది 
పసుపు - కాస్త 
కొత్తిమీర - కాస్త 
చింతపండు - 1/2 అంగుళము 
ఉప్పు - తగినంత 

తాలింపుకు = 

మినపబేడలు - 1/3 tsp 
ఆవాలు - 1/3 tsp 
జీలకర్ర - 1/3 tsp 
కరివేపాకు - 5 ఆకులు 
నూనె - 1 tsp 

తయారు చేసుకునే పద్ధతి = 

ఈ పప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్  కంటే విడిగా చేసుకోండి .

మొదట పెసర బేడలు ఒక గిన్నలో తీసుకొని కడిగి 3 కప్పుల  నీళ్ళు పోసుకొని  ........ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు,టమోటా పండ్ల ముక్కలు  ,పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టి సన్న మంట మీద వుడకనీయాలి .........

పెసర బేదాలు మెత్తగా  వుడికినాక తగినంత ఉప్పు ,చింతపండు ,కొత్తిమీర వేసుకొని ఒక 5 నిముషములు  ఉడకనిచ్చి పొయ్యి మీద నుంచి దించుకోవాలి ................

వుడుకుతున్నప్పుడు  మధ్య మధ్య లో కలుపుతూ వుండండి  అడుగు అంటకుండా నీళ్ళు కావాల్సి వస్తే కాస్త వేసుకోండి .[ 15 mint's లో పప్పు తయ్యార్  అవుతుంది ] 

పప్పు గుత్తి తో కాస్త ఎనుపుకొని  పక్కన పెట్టుకున్న  పెన్నము  లో  నూనె  వేసుకొని  తిరవాత దినసులన్ని ఒకటొకటి వేసుకొని వేగినాక పప్పులో వేసుకొని మూత  ముసుకోవాలి .

అంతే పెసరబేడల  పప్పు తయ్యార్ ....................... వేడి వేడి అన్నములోకి కాస్త నెయ్యి వేసుకొని  పప్పు వేసి కలుపుకొని తినండి .




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment