Top Food Blogs

Thursday, November 29, 2012

VANKAYA NAJAAKATH

వంకాయతో ఎన్నో  రకాల  వంటలు చేసుకోవచ్చు, వంకాయను  రాజు  అని అంటారు  వంకాయ ఇష్టము లేని వారు చాలా కొద్దిమంది  .వంకాయతో ఒక కోత్హరకం కుర నేర్చుకుందాం సరేనా పదండి .

కావలిసిన పధార్థములు  =

మసాలకు - 

  • మినపబేడలు - 11/2 కప్ 
  • శనగబేడలు - 11/2 కప్ 
  • ఆవాలు - 1 tsp 
  • జీలకర్ర - 1 tsp 
  • ధనియాలు - 11/2 tsp 
  • నూగులు [గోడుమరంగువి] - 4 - 6 tsp 
  • ఎండుమిర్చి - 9 - 10 
  • ఉప్పు 
పైన  చెప్పిన్న దినుసులన్నీ  విడి విడిగా  పెన్నము  వేసుకొని మద్యస్తపు మంట  మీద వేయించుకొని  పొడి చేసుకొని పెట్టుకోవాలి .

కూరకు కావలిసిన పదార్థములు = 
  • వంకాయలు -  చిన్నవి - 3/4 kg 
  • ఉల్లిగడ్డలు - 2 [ చిన్న ముక్కలు చేసుకోవాలి ]
  • చింతపండు - ఉసిరికాయ అంత [ నానబెట్టుకొని గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి ]
  • బెల్లము - 1/3 tsp 
  • నూనె - 3 - 4 tsp 
  • తిరవాత  గింజలు - 1/2 tsp [ ఆవాలు,జీలకర్ర,మినపబేడలు ]
  • కరివేపాకు - 7 ఆకులు 
  • ఇంగువ - చిటికెడు 
తయారుచేసుకున్దాము = 

వంకాయలు  మధ్య లో గాట్లు పెట్టి  [ గుట్టివంకాయల మాదిరి ] 
పొయ్యి  ముట్టించి  పెన్నము  పెట్టుకొని  నూనె  వేసుకొని 9 tsp  వేసుకొని  కాగినాక వంకాయలు వేసుకొని వేయించుకోవాలి 
వేగినాక  తీసుకొని  ప్లేట్ లో పెట్టుకోవాలి , ఆ వేగిన వంకయలల్లో  తాయారు చేసుకున్న పొడి పెట్టుకోవాలి .
మిగిలిన పొడి పక్కన పెట్టుకోవాలి .
మిగిలిన నూనె  లో ఉల్లిగడ్డ లు వేసుకొని  వేయించుకొని  చింతపండు  గుజ్జు వేసుకొని కాస్త విదికినాక బెల్లము ,కాస్త ఉప్పు వేసుకొని ఒక 1/4 గ్లాస్  నీళ్ళు  వేసుకొని  వుడికినాక ................
వేయించుకొన్న వంకాయలు  వేసుకొని  బాగా  కలిపి  సన్న మంట  మీద  ఉడికించి  ఒక 8 - 10 నిముషములు  .
దీనిని అన్నములోకాని  రోటి లోకాని బాగుంటుంది .




PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment