మక్ముల్ పూరి
మకమల్ పూరి ఇది ఒక స్వీట్ మా ఊరిలో ఇది చాలా వెరైటీ వంట పెళ్లిళ్లకు వాటికి చేస్తారు నేను ప్రయత్నమూచేసాను బాగుంది చాలా మనము ఇంటిలో చేసుకోవాడానికి ఇది ఒక సులువయిన పద్ధతి మరి నేర్చుకొని చేయండి మరి .
కావలిసిన పదార్థములు =
- మైదా పిండి - 1 గ్లాస్
- నెయ్యి - 1 tsp
- కాస్త వంట సోడ - చుటికెడు [ మీ ఇష్టమువుoటె వేసుకోండి ]
- వేయించుకోవడానికి నూనె
- పాకానికి చెక్కర - 1 గ్లాస్
- పుట్నాలు - 1 కప్
- చెక్కర - 3/4 కప్
- జీడిపప్పు - 6
- బాదం పప్పులు - 5
- ఒక యాలక - మెత్తగా దంచాలి
ఈ తయారు చేసుకున్న పొడి లో జీడిపప్పు - 8 ,బాదం పప్పు - 6 ,ఎందు ద్రాక్ష - 7 సన్నగా కట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి లో వేయించుకొని కలుపుకోవాలి .
పాకం తయారు కి =
ఒక గిన్నలో ఒక పావు గ్లాస్ నీళ్ళు పాకానికి తీసుకున్న చెక్కర వేసుకొని పొయ్యి ముట్టించి చెక్కర కరిగి కాస్త ముదురు పాకం రానించుకొని పొయ్యి మీదనుంచి దించుకొని పెట్టుకోండి .[గరిటెతో పాకాన్ని పోసినప్పుడు కాస్త మందముగా వుంటే మీడియం ముదురు పాకం ]
పిండి తయారు
మైదా పిండి లో నెయ్యి, కాస్త ఉప్పు ,సోడా పొడి వేసుకొని బాగా కలిపి తగినంత నీరు వేసుకొని పూరిల పిండి లా తడుపుకొని ఒక గంట మూత ముసి పక్కన పెట్ట్టుకోవాలి .
పూరీలు చేసుకుందాము =
పొయ్యి మీద పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగనీయ్యాలి .
పక్కన్న చేపాతి పలక మీద తడుపుకున్న పిండి చిన్న వుల్లె తీసుకొని పూరి మాదిరి వత్తు కొని కాగుతున్న నూనె లో వేసుకొని కాల్చి
పాకము లో వేసుకొని ఒక 2 mint's వుంచి
ఒక పళ్ళెములో తీసుకొని తాయారు చేసుకున్న పొడి వేసుకొని
మడిచి పక్కన్న పెట్టుకోవాలి .
అంతే ఎంతో సులువుగా ముక్మాల్ పూరి తయ్యర్ .
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment