Top Food Blogs

Monday, November 12, 2012

MAMIDI ALLAM ROTI PACHHADI [ FOR RICE ]

మామిడి అల్లము  ఇది  ఈ  నేలల్ల్లో దొరుకుతుంది  .చూడటానికి కాస్త అల్లము  లాగా  వుంటుంది కానీ రుచి కాస్త మామిదిలగా వుంటుంది  .మామిడి అల్లము అంటే ఎవరన్న కూరగాయల మార్కెట్  లో ఇస్తారు .

కావలిసిన  వస్తువులు = 

మామిడి అల్లము - కాస్త [ అంగుళము ]



ఒట్టి  మిరపకాయలు - 6 
ఆవాలు - 1/2 tsp 
మెంతులు - 1/2 tsp 
మినపబేడలు - 1 tsp 
ఇంగువ - చిటికెడు 
చింతపండు - అర నిమ్మకాయ అంత 
బెల్లము - 1 tsp 
ఉప్పు - తగినంత 

తాయారు చేసుకునే పధ్ధతి = 

మొదట  చింతపండు కడిగి నానబెట్టుకోవాలి .

మినపబేడలు , ఆవాలు , మెంతులు కాస్త నూనె  వేసుకొని బంగారు వర్ణములోకి [రంగు] వచ్చేవరకు వేయించుకొని  చివరకు ఒట్టి  మిరపకాయలు,ఇంగువ  వేసుకొని ఒక నిముషము వేయించుకొని పొయ్యి బంద్  చేసుకొని  చల్లరనిన్చుకోవాలి .

మిక్సీ  జార్  లో ఉప్పు తగినంత , బెల్లము వేయించుకున్న వస్తువులు వేసుకొని ,చింతపండు వేసుకొని ముక్కలు  చేసుకున్న మామిడి అల్లము వేసుకొని బాగా  మెత్తగా  తిప్పుకొని  ఒక గిన్నలోకి తీసుకోవాలి .

ఇది అన్నము లోకి దోస ,ఇడ్లీ  కి చాలా  బాగుంటుంది .




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment