Top Food Blogs

Monday, November 12, 2012

JONNA PITLA [ SWEET ITEM ]

జొన్న  పిండి   ఆరోగ్యానికి  ఎంతో  బలమయిన   ఆహారము   దీనికి   బెల్లము  జత   చేస్తే  అది  ఒక  బలమయిన స్వీట్   ఐటెం   తయారు  చేసుకోవచ్చు .

కావలిసిన  వస్తువులు - 


జొన్నపిండి  -  1 కప్ 

బెల్లము  -  3/4  కప్
యలకల  పొడి  -  1/3 tsp 
పచ్చి  కొబ్బెర -  7  tsp 
జీడిపప్పు  ,  బాదO   పప్పు - 10 కచ్చాపచ్చాగా  దంచుకోవాలి 

తయారు   చేసుకునే   పద్దతి = 


ఒక   గిన్న లో  జోన్న  పిండి  తీసుకొని  యాలకపొడి , జీడిపప్పు  బాదం పప్పు పొడి   , పచ్చి కొబ్బెర   వేసుకొని బాగా  కలిపి  ,


బెల్లము   వేసుకొని    బాగా   కలుపుకోవాలి   నీరు  వాడ  కూడదు .




ఇలా  వస్తుంది  


ఇడ్లీ  పాత్రలో  ఒక  ఇడ్లీ  ప్లేట్   కి  నెయ్యి   పూసి  [ అడుగు  ప్లేట్  పెట్టకూడదు కింద   మూడు  కాలిగా  వదిలేసి  పైన  ప్లేట్ లో  ఈ    పిట్ల లు  పెట్టండి   కింది   ప్లేట్ లో  పెడితే   నీరు  వస్తుంది  వుడికేటప్పుడు] 


ఈ తయారు  చేసుకున్న పిండి  ని బిల్లల్ల  మాదిరి చేతితో   చేసుకొని   ఆవిరి   మీద  అంటే   ఇడ్లిల   మాదిరి   ఉడక బెట్టు కొని  15 mint's , పొయ్యి   బంద్    చేసుకొని  మూత  తీసి   ఒక   5   mint's    చల్లరినాక    ఒక    ప్లెలో   తీసుకొని    నెయ్యి   కాని లేక   ఒట్టి    గానే  తినవచ్చు . 


ఎంతో  బలమయిన  జొన్న పిండి పిట్ల  తయ్యార్ .





PS:Please leave a comment once you are done.
      Thank You!




No comments:

Post a Comment