Top Food Blogs

Wednesday, November 28, 2012

KANDHI KAYALU [ SNACK ]

కందికాయల  కాలం వచ్చింది .................... అని  మన పెద్దవాళ్ళు  అంటూ వుండే  వారు  కానీ ఎంత మందికి తెలుసు దీనిని ఎలా తింటారు ఎలా  ఉడక బెట్టుకుంటారు అందుకే నేను  చెబుతాను  మీరు నేర్చుకోండి  తినండి , మీ పిల్లల్కి  పెట్టండి .

కావలిసిన పదర్తములు = 

కందికాయలు - 1/2 kg 
ఉప్పు - 2 tsp 

వుడకబెట్టుకుందాము = 

ఇప్పుడు సీజన్  కందికాయలకి  మార్కెట్  లో దొరుతుంది ఎప్పుడు  ఏదో ఒక  చిరుతిండి  కావాలి  మనకు  అలా ఎప్పుడు నూనె  పదార్థములు  కాకుండా ఇలాంటివి తినాలి చేయడము సులువు ..................

అలా  తెచ్చిన  కందికాయలని  ఒక గిన్నలో వేసి ఒక రెండు సార్లు కడగండి [ ఎరువులు అవి చల్లింటారు కదా ]

కుక్కర్  లో వేసుకొని  ఈ కడిగిన కందికాయాలని   నీరు పోసి  కాయలు మునిగే వరకు అంటే ఇలా  .................




మరీ  ఎక్కువ నీళ్ళు వేసుకోకండి  మెత్తగా  అవుతాయి గింజలు 

ఉప్పు ఒక 2 - 3 tsp  వేసుకొని  మూత  మూసుకొని ఒక రెండు  విసిలిస్  రానివ్వండి  


మూత   తీయడానికి  వచ్చిన తరువాత  ఒక  కాయ తీసుకొని వలిచి  చూడండి గింజలు మీకు కావలిసినంత ఉప్పగా ఉన్నాయా  లేదా అని [ ఒకొక్కరు ఒక మాదిరి ఉప్పగా తింటారు ] మేము  మరి ఉప్పగా తినము కమ్మగా తింటాము .

ఉప్పు సరిపోకుంటే అలాగే కాసేపు వదిలేయండి  ఆ నీటి తోటే ఉప్పు పట్టుకుంటుంది ఒక పది నిముషముల తరువాత  చూడండి మీకు సరి పోతే బొర్రల గిన్నలోకి వంచేయండి నీరు కిందికి పోతుంది 



ఇప్పుడు ఇంక వలుచుకొని తినండి .........................






PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment