వుద్దిబేడల తో వడలు చేసుకోవడం అందరికి తెలుసు, వేటితో పెరుగు వడలు కుడా చేసుకుంటారు చాలా బాగుంటుంది చేయడము సులువే మరి పదండి చేసుకుందాము .
కావలిసిన పదార్థములు =
PS:Please leave a comment once you are done.
Thank You!
కావలిసిన పదార్థములు =
- వుద్ధిబేడలు - 1 గ్లాస్
- పచ్చిమిరపకాయలు - 8
- ఉల్లిగడ్డలు- 1
- కోత్హిమీర- కాస్త
- ఉప్పు -తగినంత
- అల్లము- కాస్త
- జీలకర్ర -1/2 tsp
- నూనె - వడలు వేయించు కోవడానికి
తాయారు చేసుకునే పద్ధతి =
- మొదట వుద్ధిబేడలు ఒక నలుగు గంటలు నాన బెట్టుకొని ,మెత్తగా గట్టిగా రుబ్బుకోవా
- ఇలా రుబ్బుకున్న పిండిలో జీలకర్ర,ఉల్లిగడ్డ ముక్కలు[సన్నగా తరుగుకున్నవి],పచ్చిమిరపకాయ ముక్కలు ,తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ,
- పొయ్యి మీద పెన్నము లో నూనె వేసుకొని బాగా కాగినాక
- అర చేయి తడి చేసుకొని కాస్త పిండి తీసుకొని ఇలా చేసుకొని
- వడ మాదిరి చేసుకొని
- కుడి చేతిలోకి తీసుకొని కాగుతున్న నూనె లో వేసుకొని [వడ వేసే తప్పుడు సన్న మంట పెట్టుకోండి]
- కాగుతున్న నూనె లో వేసుకొని [వడ వేసే తప్పుడు సన్న మంట పెట్టుకోండి]
- బంగారు వర్ణములోకి వస్తేనే తీసుకొని చల్ల నీటిలో వేసుకొని ఓకే నిముషము తరువాత తీసుకొని తయ్యారు చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి,
ఇప్పుడు మసాలా పెరుగు చేసుకుందాము ,
- కమ్మటి పెరుగు బాగా చిలికి దానిలో పచ్చిమిరపకాయ,ఉప్పు,,అల్లము,,కాస్త కొత్తిమీర వేసి మిక్సీ లో తిప్పుకొని గిలక్కోట్టుకున్న పెరుగులో వేసుకొని బాగా కలిపి
- నీటిలో వేసుకున్న వేడి వేడి వడలు ఈ పెరుగులో వేసుకొని వడ్డించండి ఒక పది నిముషముల తరువాత ......................
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment