ఎప్పుడు కూరలు చేసుకోవాలి అంటే విసుగు వస్తుంది అప్పుడు ఇలా అమ్మము తో వేరిటి గ చేసుకోండి బాగుంటుంది .
కావలిసిన పదార్థములు -
టమోటాలు - 1/2 kg
వుర్లగడ్డలు - 1 (or)2
పచ్చిమిరపకాయలు - 9[సరిపడ]
అల్లము - కాస్త
ఉప్పు - తగినంత
కొత్తి మీర - కాస్త
నూనె - 15 tsp
పప్పులపొడి - 2 tsp [పుత్నలపొడి]
తిరవతగింజలు- శనగబేడలు,ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,కరివేపాకు
అన్నము - 1 glass [చేసి చల్లర్చుకోవాలి]
చేసుకునే విధానము -
కావలిసిన పదార్థములు -
టమోటాలు - 1/2 kg
వుర్లగడ్డలు - 1 (or)2
పచ్చిమిరపకాయలు - 9[సరిపడ]
అల్లము - కాస్త
ఉప్పు - తగినంత
కొత్తి మీర - కాస్త
నూనె - 15 tsp
పప్పులపొడి - 2 tsp [పుత్నలపొడి]
తిరవతగింజలు- శనగబేడలు,ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,కరివేపాకు
అన్నము - 1 glass [చేసి చల్లర్చుకోవాలి]
చేసుకునే విధానము -
- మొదట అన్నము చేసుకొని చల్లర్చుకోవాలి .
- వుర్లగడ్డలు చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి .
- టమోటాలు కడిగి కాస్త ఆరినక ముక్కలు చేసుకోవాలి [ టమోటా పండ్లు ఫ్రిడ్జ్జ్ లో పెట్టకూడదు ఎందుకంటే అవి నీరు వూర్తాయి అప్పుడు గుజ్జు చిక్కగా రాదు రుచి బాగుండదు]
- ఒక గిన్న పొయ్యిమీద పెట్టుకొని పొయ్యి ముట్టించి నూనె వేసుకొని కగినాక తిరవాత వేసుకొని వేగినాక వుర్లగడ్డముక్కలు వేసుకొని అవి వేగ్గినక టమోటా ముక్కలు వేసుకోవాలి ,తరువాత బాగా కలుపుకోవాలి .పొయ్యి డి మంట పెద్దగా నే వుండాలా ,మూత మూయ్యకూడదు ఎందుకంటే నీరు ఊరుతుంది కాబట్టి
- టమోటాలు మగ్గినాక పచ్చిమిర్చి,ఉప్పు,అల్లము,ఒట్టి కొబ్బెర ,కొత్తిమీర అన్ని కలిపి మిక్సీ జార్ లో వేసుకొని మెదుపుకోవాలి .
- అలా మేడుపుకున్న కారాన్ని ఉడుకుతున్న టమోటాల గుజ్జు లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఏడు నిముషముల తరువాత దిoచాలి .
- అన్నములో ఈ తయ్యార్ అయిన గుజ్జు వేసుకొని పప్పుల పొడి వేసుకొని బాగా కలిపి అందరికి పెట్టండి.
సూచన : ఈ గుజ్జు చేసుకోవడానికి అర్ధము నాటి టమోటాలు,అర్ధము హైబ్రిడ్ పండ్లు వాడండి రుచి బాగుంటుంది .........
No comments:
Post a Comment