Top Food Blogs

Friday, June 15, 2012

DONDAKAYA PACHHADI NILUVADI

దొండకాయ  తో అందరు కూరలు  రోటి పచ్చడ్లు చేసుకుంటారు కానీ ఇలా నిలువ పచ్చడి చేసుకోవడం .....కదా చాలా  బాగుంది ఎంతో రుచి గ వుంది  చాల సులువు మరి చేసుకుందామా .

కావలిసిన పదార్థములు -

దొండకాయలు - 1/4 kg 
ఒట్టి కారము - సరిపడా [1/2 cup]
ఉప్పు - సరిపడా [1/4 cup]
నూనె - సరిపడా [8 tsp]
ఆవాలు- 2 tsp
నిమ్మరసం - 1/2 cup
ఆవపిండి - 4 tsp
జీలకర్ర - 2 tsp
పసుపు - 1/4 tsp
ఎల్లిపాయలు - 6 కాస్త దంచి వేయాలి [కచ్చ పచ్చ]

చేసుకునే విధానము -

మొదట దొండకాయలు  కడిగి చుడుచుకొని తడి ఆరిన తరువాత  మధ్య లో గాట్లు పెట్టుకోవాలి [గుత్తి వంకాయ కు పెట్టె మాదిరి]
అలా  గాట్లు పెట్టుకున్న దొందకయాలని ఒక గిన్నలో తీసుకొని ఉప్పు,కారము,ఆవపిండి,పసుపు,ఆవాలు,జీలకర్ర,నూనె,దంచుకున్న ఎల్లిపాయలు ,నిమ్మరసం అన్ని కలిపి బాగా మూత మూసి పెట్టుకోవాలి .



తరువాత  అలా  మూత  ముసి ఒక నలుగు నుంచు  ఐదు గంటలు పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో రుచి గ వుండే దొండ కాయ పచ్చడి  తయ్యార్  ,ఫ్రిజ్  లో పెట్టుకుంటే పది రోజులు అయిన వుంటుంది .

No comments:

Post a Comment