Top Food Blogs

Monday, June 18, 2012

CAPCIUM CURRY WITH DHANIYA POWDER [FOR RICE AND ROTIES]

క్యాప్సికం  అంటే  చాలా  మందికి  నచ్చుతుంది ఎన్నో పోషకాలు వుంటాయి  దీనితో చాలా రకాలు చేసుకుంటారు ఇది మా చిన్న అత్తమ్మ  నేర్పినారు చాలా  బాగుంటుంది రుచిగా వుంటుంది చేయడము సులువే  మరి చేసుకుందాము రండి ..................

కావలిసిన పదార్థములు -
  • ఒట్టికారము - 2 tsp
  • ఉల్లిగడ్డలు - 2
  • క్యాప్సికం - 4
  • ఒట్టికోబ్బెర - చిన్న ముక్క 
  • ఉప్పు - తగినంత 
  • ధనియాలు - 1 tsp
  • పప్పుల పొడి - 5 tsp
  • నూనె - 7 tsp [ taginantha ]
తాయారు చేసుకునే పద్దటి -

  • మొదట  క్యాప్సికo  కడిగి ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి .
  • పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నునే వేసుకొని కాగినాక   తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి అవి ఎర్రగా వేగినాకా    క్యాప్సికం  ముక్కలు వేసుకొని వేయిన్చుకోవాలి .
  • పక్కలో మిక్సీ జార్ లో ఒట్టి  కొబ్బెర ,ఉప్పు,ధనియాల పొడి ,ఒట్టి కారము  అన్ని కలిపి మెత్తగా వేసుకోవాలి, చివరికి పప్పులు కూడా అందులో వేసి బాగా మేత్తగా  తిప్పుకోవాలి .       
  • క్యాప్సికం  అవి వేగినాక ధన్చుకున్న పొడి కూడా వేసి సన్నటి మంట  మీద  బాగా కలుపుతు వేయించుకోవాలి  ఓకే పది నిముషములు అంతే కూర  తయ్యార్ 
  • ఇది అన్నములోకి రోటి లోకి బాగుంటుంది .

No comments:

Post a Comment