Top Food Blogs

Tuesday, June 19, 2012

ADAYYAR EGG CURRY

ఎగ్  అంటే అందరికి ఇష్టమే కానీ  చాలా  ముందికి ఇష్టము వుండదు దాని వాసనకి  ఎన్నో పోషక విలువలు వుంటుంది ఇందులో మరి అలాంటప్పుడు  ఎన్నోరకాలుగా చేసుకొని తినవచ్చు మరి చేసి చూడండి , ఈ  కూర   చేయడము  సులువు  రుచి అమోఘం  మా  వారికి  ఇది  ఒక ఇష్టమయిన కూర  అందుకే  మీతో పంచుకుంటున్నాను .

కావలిసిన పదార్థములు - 

  • గుడ్లు - 6
  • ఉల్లిగడ్డలు - 3
  • టమోటాలు - 2
  • అల్లము,కొత్తిమీర పేస్టు - 1 tsp
  • చింతపండు - కాస్త 
  • పచ్చి కొబ్బెర - 1/4 చిప్ప 
  • మిరియాలు - 7
  • పచ్చిమిరపకాయలు - 4 
  • ఉప్పు - తగినంత 
  • ఒట్టి కారము - 1/2 tsp
  • నూనె  - 4 tsp
  • జీర పొడి - 1/2 tsp
  • ధనియ పొడి - 1/2 tsp
తాయారు చేసుకునే విధానము - 

  • మొదట గుడ్లు  ఉడక బెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి .
  • ఒక  పెన్నము  పెట్టుకొని  కాస్త నూనె వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కాస్త వేయించుకోవాలి 

  • తరువాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పేస్టు చేసుకోవాలి .
  • మల్లి పెన్నము పెట్టుకొని  నూనె  వేసి కాగినాక  ఆవాలు,జీలకర్ర  వేసి వేగినాక  ఒక అర్ధము ఉల్లిగడ్డ ముక్కలు గ చేసి వేసుకోవాలి.
  • అవి  వేగుతున్నప్పుడే  మధ్యయ   చీలిక చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మద్యస్థ పు మంట మీద వేయించు కోవాలి .
  • అవి కాస్త ఎర్రగా  అయిన వెంటనే టమోటా పండు ఒకటి సన్నగా తరుగుకొని వేయాలి అది మగ్గుతూ వుంటుంది .
  • అప్పుడు కొత్తిమీర అల్లము పేస్టు  వేసుకొని ఒక రండు నిముషములు బాగా కలపాలి.
  • తరువాత వేయించుకున్న  వుల్లిగడ్డల పేస్టు వేసి ఒక రండు నిముషములు వేయించాలి .
  • తరువాత  మిగిలిన ఒక టమోటా ని మిక్సీ లో వేసి పేస్టు చేసుకొని మగ్గుతున్న కూర  లో వేసుకోవాలి అల ఒక రండు నిముషములు వేగిన తరువాత ....................[అంటే  నూనె , కూర  లో నుంచు బయటికి కనపడిస్తుంది ఎంత తక్కువ వేసిన ]
  • పచ్చికోబ్బెర మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్టు చేసుకోవాలి [కాస్త నీళ్ళు వేసుకొని తిప్పుకోండి]దీనిని కూడా ఉడుకుతున్న కూరలో  వేసుకోవాలి తరువాత   మిరియాలు దంచి ఆ పొడి ఇంకా ఉప్పు,కారము,ధనియాల పొడి,జీరపొడి అన్ని వేసుకోవాలి ఇంకా బాగా  కలుపుకోవాలి ..............

  • చింతపండు గుజ్జు వేసుకోవాలి మల్లి బాగా  కలిపి ఒక రెండు నిముషములు  మగ్గబెట్టుకోవాలి ఒక అర్ధము గ్లాస్ నీళ్ళు వేసుకొని మగ్గినాక వలుచుకున్న గుడ్లు వేసుకొని మల్ల ఒక రెండు నిముష ములు మగ్గినాక దించుకొని పుల్క లో కానీ చేపతి లో కానీ తిన వచ్చు .





No comments:

Post a Comment