టమోటా పచ్చడి [ 10 డేస్ నిల్వ ] ఈ పచ్చడి అన్నములోకి,ఉప్మా లోకి చాలా బాగుంటుంది చేసుకోవడం సులువు రుచికి రుచి ఒక్క ఈ పచ్చడి చేసుకున్న చాలు అన్నము లోకి చాలా బాగుంటుంది .
కావలిసిన పదార్థములు -
నాటి టమోటాలు - 1 kg
ఎల్లిపాయలు - 4 [పొట్టు తీసుకొని పెట్టుకోండి ]
ఒట్టికారము - 15 tsp
ఉప్పు - తగినంత
చింతపండు - కాస్త [వేసుకోకున్న పర్వాలేదు]
పసుపు - 1/4 tsp
నూనె - 15 tsp
తిరవాత గింజలు - 3 tsp [ ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,శనగబేడలు,కరివేపాకు,ఇంగువ]
తాయారు చేసుకునే పద్ధతి -
కావలిసిన పదార్థములు -
నాటి టమోటాలు - 1 kg
ఎల్లిపాయలు - 4 [పొట్టు తీసుకొని పెట్టుకోండి ]
ఒట్టికారము - 15 tsp
ఉప్పు - తగినంత
చింతపండు - కాస్త [వేసుకోకున్న పర్వాలేదు]
పసుపు - 1/4 tsp
నూనె - 15 tsp
తిరవాత గింజలు - 3 tsp [ ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,శనగబేడలు,కరివేపాకు,ఇంగువ]
తాయారు చేసుకునే పద్ధతి -
- మొదట టమోటాలు కడిగి తుడిచి ముక్కలు పక్కన పెట్టుకోండి ,ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోండి.
- ఒక పెన్నము పొయ్యి మీద పెట్టుకొని ముట్టించి మూడు స్పు న్ల నూనె వేసుకొని కాగినాక ముక్కలు గ చేసుకున్న టమోటాలు వేసుకొని బాగా మగ్గ నియ్యాలి ,అలా ముక్కలు బాగము మగ్గినాక పొయ్యి ది మంట సన్నగా చేసుకొని ఉప్పు కారము [వేసుకుంటే చింతపండు గుజ్జు]వేసుకొని బాగా కలుపుకోవాలి.
- పక్కన మల్ల పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని మిగిలిన నూనె వేసుకొని కాగినక ఎల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిముషముల తరువాత తిరవాత గింజలు వేసుకొని సన్న మOట మీద కలుపుతూ వుoడాలి అన్ని వేగినాక పొయ్యి బంద్ చేసుకొని పక్కన మగ్గుతున్న పచ్చడిలో వేసుకొని బాగా కలిపి ఒక అయిదు నిముషముల తరువాత దించవలెను .
- చల్లారిన తరువాత తడి లేని డబ్బాలో వేసుకొని ఆ రోజు వాడుకున్న తరువాత ఫ్రిడ్జ్ [fridge]లో పెట్టుకోండి.
No comments:
Post a Comment