కావలిసిన పదార్థములు -
- మైదా - 1 గ్లాస్
- బెల్లము - అదే కొలత గ్లాస్ తో 3/4
- జీడిపప్పు - 15
- యాలకపొడి - 1 యాలకను మెత్తగా దంచి పెట్టుకోండి
- పాలు - కాచి చల్లర్చినవి - 2 గ్లాస్సెస్
- నెయ్యి - 15 tsp
తాయారు చేసుకునే పద్ధతి -
- మొదట ఒక గిన్న తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని 5 tsp నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని బంగారు వర్ణము లోకి రాగానే మైదా పిండి వేసుకొని [సన్న ముంట మీద ]ఒక 10 నిముషములు [కలుపుతూవుoడాలి] వేయించుకోవాలి .
- తరువాత పొయ్యి బంద్ చేసుకొని పాలు,బెల్లము వేసుకొని వుంటలు రాకుండా కలిపి మల్ల పొయ్యి ముట్ట్టించి [సన్నటి ముంట మీద] మిగిలిన నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ వుoడాలి.
- ఒక పది నిముషముల తరువాత యాలకల పొడి వేసుకొని మల్ల ఒక అయిదు నిముషములు బాగా కలిపి పొయ్యి బంద్ చేసుకొని నెయ్యి పుసుకున్న పళ్ళెములో వేసుకొని చల్లారిన తరువాత ముక్కలుగా కోసుకొని అతిధులకు పెట్టండి.
No comments:
Post a Comment