మొలక ఎత్తిన్న పెసలు కాని ఇవన్న గింజలు కాని తినడము ఆరోగ్యానికి ఎంతో మంచిది . చలువ ఇంకా ఆరోగ్యము వీటితో కూర చేసుకుందాము మరి పదండి ....................
కావలిసిన పదార్థములు -
మొలక ఎత్తిన పెసలు - ఒక గ్లాస్
ఉల్లిగడ్డలు - 2
టమోటా - 2
అల్లము ఎల్లిపాయ పేస్టు - 1 tsp
ఉప్పు - తగినంత
కారము - 1/2 tsp
కొత్తిమీర - కాస్త
తాయారు చేసుకునే పద్ధతి -
మొదటి రోజు ఉదయము పెసలు రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి నాన బెట్టుకోవాలి , రాత్రి గజ్జి బట్టలో వేసుకొని కట్టి మూత ముసి గిన్నలో పెట్టుకోవాలి [గంజి బట్ట లేకుంటే నీరు అంతా తీసివేసి మూత మూసి పెట్టండి
[dry vessel] లో మర్నాడు మధ్యానము కి మొలకలు వస్తుంది .ఇప్పుడు ఇవి కూర చేసుకోవడానికి తయ్యార్
[మొలకెత్తిన పెసలు ఇవే ,ఇదే గంజి బట్ట ]
- ఉల్లిగడ్డలు ముక్కలు చేసుకోవాలి ,
- టమోటాలు ముక్కలు చేసుకోవాలి
- అల్లం ఎల్లిపాయ మెత్తగా దంచి పెట్టుకోవాలి
ఇంక చేసుకుందాము పదండి -
మొదట మొలక ఎత్తిన పెసలు కుక్కర్ లో వేసుకొని 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత మూసి ఒక రెండు విసిల్స్ రానిచ్చి పెట్టుకోండి .
ఒక గిన్న పొయ్యి మీద పెట్టి ముట్టించి నూనె వేసుకొని కాగినాక ఉల్లిగడ్డలు వేసుకొని [మధ్యస్తపు మంట] వేయించుకోవాలి ఒక నిముషము తరువాత అల్లం ఎల్లిపాయ పేస్టు వేసుకొని వేయించుకోవాలి
టమోటాలు మగ్గినాక ఉప్పు,కారము,పసుపు వేసుకొని కలిపి
కుక్కర్ మూత తీసి వుడికిన పెసలల్లో ఈ వేయించుకున్న వుల్లిగడ్డల మిశ్రమము వేసుకొని బాగా కలిపి మల్ల
కుక్కర్ మూత ముసి ఒక విసిల్ రానిచ్చి మూత తీసుకున్న తరువాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపి రోటి కి లేక చేపతికి లేక అన్నము లోకి తినండి ..
No comments:
Post a Comment