పెసర బేడల పచ్చడి - చాలా మంది పెసర బేడలు తినరు కానీ అవి చలువ ఎండాకాలం మంచిది బ్రాహ్మలు ఈ పచ్చడి చాల ఎక్కువ చేసుకుంటారు చేయడము సులువు రుచికి రుచి కూడా మరి చేయండి ........
కావలిసిన పదార్థములు -
పెసరబేడలు - [ స్పెషల్ బేడలతోనయిన చేసుకోవచ్చు] కానీ ఈ పొట్టు బేడల రుచి చాలా బాగుంటుంది - 1 CUP
కావలిసిన పదార్థములు -
పెసరబేడలు - [ స్పెషల్ బేడలతోనయిన చేసుకోవచ్చు] కానీ ఈ పొట్టు బేడల రుచి చాలా బాగుంటుంది - 1 CUP
పచ్చిమిరపకాయలు - 5
ఉప్పు - తగినంత
పచ్చి కొబ్బెర - 1/4 చిప్ప
కొత్తిమీర - కాస్త ఎక్కువే
నిమ్మరసం - 3 tsp
నూనె - 2 tsp
తిరవాతగింజలు - మినపబేడలు,ఆవాలు,జీలకర్ర- 1/4 tsp ,ఇంగువ -చిటికెడు,కరివేపాకు -ఒక రెమ్మ
తాయారు చేసుకునే పద్ధతి -
- పెసర బేడలు ఒక రెండు మూడు గంటలు నాన బెట్టుకోవాలి తరువాత బాగా కడిగి వచ్చిన కాడికి పొట్టు తీయాలి
- తరువాత మిక్సీ జార్ లోకి ముక్కల్లు గ చేసుకున్న పచ్చి కొబ్బెర ,ఉప్పు,పచ్చిమిరపకాయలు వేసి బాగా తిప్పుకోవాలి
- తరువాత కొత్తిమీర పెసర బేదాలు వేసి టిప్పు కోవాలి కచ్చ పచ్చగా
- తరువాత గిన్నలోకి తీసుకొని నిమ్మరసము వేసుకొని బాగా కలిపి పెన్నము పెట్టుకొని తిరవాత వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నము లో తినండి .
No comments:
Post a Comment