Top Food Blogs

Monday, June 11, 2012

MULLANGI AAVA PETTI KURA [ FOR RICE ]


ముల్లంగి  ఆవ పెట్టి  కూర  ఇది ఒక బ్రాహ్మణుల వంటకం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు తిని రుచి చూసి నేర్చుకున్నాను మీరు కూడా నేర్చు కుంటారని చెపుతున్నాను ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దాని వాసన  అంటే  చాలా మందికి ఇష్టము వుండదు మరి ఇలా చేయండి ముల్లంగి అంటే ఎవ్వరు నమ్మరు

కావలిసిన పదార్థములు - 


  • ముల్లంగి - 2 [చిన్నగా ముక్కలు చేసుకోవాలి]
  • పెరుగు - 1 GLASS [మజ్జిగ ]
  • పచ్చిమిరపకాయలు - 4 
  • అల్లము - కాస్త 
  • తిరవాతగింజలు - ఆవాలు,మిన్పబేడలు,కరివేపాకు,జీలకర్ర,శనగబేడలు
  • చింతపండు గుజ్జు - 4 tsp
  • ఉప్పు - తగినంత 
  • నూనె - 2 tsp
  • పసుపు - కాస్త 
  • ఇంగువ - చిటికెడు 
తాయారు చేసుకునే పద్ధతి - 

  • మొదట ముల్లంగిలు చెక్కు తీసుకొని సన్నని ముక్కలు చేసుకోవాలి 
  • ఈ చేసుకున్న ముక్కలని మజ్జిగలో వేసుకొని  15 mints [నిముషముల వరకు]నన బెట్టుకోవాలి [దీని వాళ్ళ ముల్లంగి వాసనా పోతుంది]
  • తరువాత బాగా పిసికి మజ్జిగ లోనించి తీసి  నీళ్ళలో వేసి ఒక పది నిముషములు [10 mints] ఉడక బెట్టుకోవాలి 
  • వుడికిన తరువాత నీరు అంత లేకుండా గట్టిగ పిండి పక్కన పెట్టుకోవాలి .
  • పొయ్యి ముట్టించుకొని పెన్నము పెట్టుకొని నూనె  తిరవత గింజలు వేసుకొని వేగినాక అల్లము, పచ్చిమిరపకాయలు ,వేసి వేయించుకొని ఇంగువ  వేసి కలిపి చింతపండు గుజ్జు వేసుకొని కాస్త నీరు వేసుకొని వుదకనియ్యాలి [మద్యస్తపు మంట మీద]
  • వుడికిన చింత పండు పులుసులో ఉడక బెట్టుకున్న ముల్లంగి ముక్కలు  ఉప్పు వేసుకొని  బాగా కలిపి చల్లార నిచుకోవాలి .


ఇప్పుడు దీనికి ఆవ పెట్టుకోవాలి 

 కావలిసినవి - 

ఆవాలు - 1 tsp 
నూనె  - 1 tsp

తయారు చేసుకునే పద్ధతి  - మొదట ఆవాలని  వేయించుకొని  దంచి నూనె  వేసి కలిపి నాన బెట్టాలి .

  • ఇప్పుడు చల్లారిన ముల్లంగి కూరలో  ఈ  ఆవ  వేసుకొని బాగా కలిపి వడ్డించండి ఎంతో రుచి గ వుంటుంది .

No comments:

Post a Comment