కావలిసిన పదార్థములు -
- నూడిల్స్ - 1/2 కప్
- ఎగ్ - 2
- ఉల్లిగడ్డ - 1 [ సన్నగా తరగాలి]
- పచ్చిమిరపకాయ - 1 [సన్నగా తరగాలి]
- అల్లము పేస్టు - 1/4 tsp
- క్యారట్ తురుము - 1 1/2 tsp
- సిమ్ల మిర్చి ముక్కలు - 2 tsp
- చాట్ మసాల - 1/4 tsp
- ఉప్పు - 1/4 tsp [సరిపడ]
- ఒట్టి కారము - 1/4 tsp
- జీడిపప్పు -4,యలక - 1,షాజీర- కాస్త :- అన్ని కలిపి బాగా మెత్తగా దంచుకోవాలి
- మొదట నూడిల్స్ నీటిలో వేసి ఒక tsp నూనె వేసుకొని వుడికిన్చు కొని బొర్రల గిన్నలో వoచేసుకొని మల్ల కాస్త నూనె వేసుకొని కలిపి పెట్టండి ,దీని వళ్ళ నూడిల్స్ ఒకటికి ఒకటి అటుకోకుండా వుంటుంది.
- ఒక గిన్న తీసుకొని దానిలో వుల్లి గడ్డముక్కలు , పచ్చిమిర్చిముక్కలు , చాట్ మసాలా, ఉప్పు , కారము, మసాల పొడి ,అల్లము పేస్టు , క్యారట్ తురుము,క్యాప్సికం ముక్కలు ,ఎగ్గ్స్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి .
- పెన్నము పొయ్యి మీద పెట్టుకొని కాలినాక ఫైన కలుపుకున్న ఎగ్ మిశ్రమములో వుదకబెట్టుకున్న నూడిల్స్ వేసుకొని బాగా కలిపి కాలుతున్న పెన్నము మీద వేసుకొని తగినంత నూనె వేసుకొని
- మద్యస్తపు మంట మీద రెండు వైపులా కాలుచుకొని టమోటా సాస్ తో పిల్లలకి పెట్టండి .
note :- షాజీర వద్దు అంటే వేయకుండా జీడిపప్పు,యలక ఒక్కటే దంచి వేసుకోండి
No comments:
Post a Comment